ఆరాటపు ప్రయాణం (సంక్రాంతి కథల పోటీ)

ఆరాటపు ప్రయాణం
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ -2022)

రచన: డి. స్రవంతి

ఉదయించే భానుడి కిరణాలకు పుడమి పరవశించే వేల…తొలి పొద్దులో మంచు బిందువులు ముత్యాల లా మెరుస్తున్న సమయాన…
కి…కి…మంటు హరన్ మోతలతో ప్రయాణ ప్రాగణం మార్మోగిపోయింది.
పనికి వెళ్ళేవారు, శుభకార్యాలకు వెళ్ళేవారు కొందరు అయితే ,ఉద్యోగానికి వెళ్ళేవారు మరికొందరు ఇలా బస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు..
ఆ ఎదురు చూపు కాస్త… మంచు బిందువులు స్వేద బిందువులుగా మారాయి… ఇంతలో ఒక వ్యక్తి అదిగో రథం.. అదిగదిగో రథం అంటూ కేకలు వేశాడు. చుట్టూవున్న జనాలకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు ఊపిరి పీల్చుకుని ఒకరిని ఒకరు తోసుకుంటూ బస్ ఎక్కారు.
రథ సారథి రథాన్ని ప్రారంభించాడు. కిక్కిరిసిన జనంతో బస్సు నిండు కుండను తలపిస్తుంది. ఏరా ! “సూరిగా యాడికి వెళ్తున్నావు” అని వీరయ్య అరుపుకు ప్రక్కన ఉన్న చంటిపిల్లాడు బావురుమంటు ఏడుపు ప్రారంభించాడు.
ఎక్కడికి… ఈ పరుగు.. అని ఫోన్ రింగ్ అవుతుంది అందరూ నవ్వుకుంటూ ఎవరి ఫోన్ అని చూస్తున్నారు. ఫోన్ విరామం లేకుండా మోగుతూనే ఉంది. ఆ ఫోన్ ఎవరిదో కాదు మన రథసారథిది. డ్రైవర్ గారు ఫోన్ రింగ్ అవుతుంది మాట్లాడండి ఇ అని ప్రయాణికుల మాటలకు”డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడ కూడదు” అని వినయంగా సమాధానం చెప్పాడు. పోనీ బస్సు ఆపి మాట్లాడండి. “లేదు.. లేదు.. నాకు డ్యూటీ నే ముఖ్యం” అని సమాధానం చెప్పాడు.
కిక్కిరిసిన జనాలలో పాప్ కార్న్…
పాప్ కార్న్…, సమోసా… సమోసా…అంటు మద్యలో కేకలకు మంచి గాఢ నిద్రలో ఉన్న గోపి ఒకేసారి ఉలిక్కి పడిలేచి. వీడి సమోసా సల్ల గుండా అంటూ.. సమోసా ఇవ్వు బాబు అన్నాడు. గోపి సమోసా తీసుకొని కేకలు వేయడం కాదు ఉల్లిగడ్డలు ఏవి అన్నాడు.. దానికి వాడు సమోసా తినడం కొత్త హ! సమోసా తిని చూసుకో..అన్నాడు.గోపి వెర్రి వెంగళప్ప ముఖం వేసుకొని చూశాడు.
ఎక్కడికి నీ పరుగు అని ఫోన్ రింగ్ టోన్ మోగుతుంటే డ్రైవర్ వెనకనున్న రామయ్య అనే వ్యక్తి “ఏంటయ్యా ఈ గోల ఆ ఫోన్ మాట్లాడు అన్నాడు”.సరే..సరే…కానీ అంటూ.. ఇంతకీ కండక్టర్ టికెట్లు తీసుకోవడం అయిపోయిందో లేదో అని మనసులో అనుకుంటూ వెనక ఉన్న కండక్టర్ ను పిలవండి అని అన్నాడు.
వెనక ఉన్న వాళ్ళందరూ ముందే ఉన్నాడుగా అంటూ కేకలు వేశారు.. రామయ్య “ఓరిని …ముందు వెనక సుసుకోవ నీ తోటోడు ఎక్కిండ లేదా సూడవ”. దెబ్బకి కంగుతిన్న డ్రైవర్ ఇంతకి ఫోన్ ఎవరా అని చూస్తే కండక్టర్ కాల్ ఉంది. వెంటనే కాల్ చేశాడు. హలో..హలో.. ఎందన్న నీ ఆరాటం సళ్లగుండ నేను ఎక్క కుండానే బస్ పోనిచ్చావు..సర్లే తమ్మి మన్నించు ఇక్కడే ఉన్నా ఆటోకి వచ్చెయ్ అన్నాడు. బస్ అంతా నిశ్శబ్దం ఆవరించింది ఒక్కసారి అందరూ నవ్వుకున్నారు.

************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!