విప్పారిన విరహం!

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

విప్పారిన విరహం!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత. పి.వి.ఎల్

మనసుని చుట్టిన
విరహం విప్పారుతోంది..
కనుమరుగైన ఆశలన్నీ
తెగి పడిపోయిన మన బంధాన్ని చూసి
తపనల తడిలో..
తడిసి ముద్దై పోతున్నాయి..
నా కళ్ళు వర్షిస్తే
కనులారా చూడాలని నిరీక్షించే
నయనాలన్నీ నివ్వెరతో నీరైపోతున్నాయి..
ఈ ఉద్విగ్నతకు
కారణం నువ్వేనని తెలియక
కట్టలు తెగిన కాలువలా
మోహం ప్రవహిస్తోంది..
అందుకే
నా మనసుని చుట్టిన విరహం
జ్ఞాపకాల నిశ్శబ్దంలో
మనస్పూర్తిగా విప్పారుతోంది.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!