మానసిక సంఘర్షణ
రచన: మహేంద్ర కుమార్
తప్పును చూపే వేలు ఒప్పును గుర్తిస్తుందా
నిందలు మోపే నాలుక మంచిని ప్రశంసిస్తుందా
మలిన మనసులకు స్వచ్చత విలువ తెలుస్తుందా
అయినవాళ్ళు ఉన్నా అనాధగా మిగిలిన జీవితం
అందరి మధ్యన ఉన్నా ఒంటరిగా సాగుతున్న పయనం
గుండె లోతుల్లోన బాధలు తొలిచేస్తున్నా
తడి ఆరని కళ్ళకు దారేదైనా కనిపిస్తుందా
కటిక చీకటిని తోలే వెలుతురేది
భయాన్ని దూరం చేసే అభయం ఏది
మానసిక వేదనను కట్టడి చేసే తాళం ఏది
గతి తప్పిన కాలం నీడై వెంటాడుతుంటే
గాయం మిగిల్చిన మచ్చలు తోడై వస్తుంటే
కలతలు తీరి కుదుట పడేది ఎప్పుడు
అబాండాళ్ల అఘాదాలను దాటేదెప్పుడు