నిశ్శబ్ద యుద్దం

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

నిశ్శబ్ద యుద్దం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దుర్గా మహాలక్ష్మి ఓలేటి

నిశ్శబ్దం అది ఒక అందమైన అబద్ధం ..
మది అలల మాటున మాటు వేసిన
దోబూచుల తరంగం
కలసిన కన్నుల మధ్య అంతం
లేని ఆరాటం అలుపెరుగని పోరాటం….

పెదవి దాటని మౌనం
గుండెల్లో విచ్చుకున్న
తొలి ప్రేమ పుష్పం….

మది దాటని మైకం
మస్తిస్కాన మబ్బులై
కమ్మిన జ్ఞాపకాలు
మేలి ముసుగు చాటున
ముస్తాబైన ఒంటరి వధువై
ఎదురు చూస్తున్న వేళ….

ఈ ఎడబాటు భీష్ముడి
అంపశయ్య ను మరిపించగా
మరో మారు నీతో గడిపిన
క్షణం మరో ప్రపంచమై
ఆహ్వానం పలికే….

ఏది ఏమైనా నీతో
ఆ మధుర భావనలు
మల్లె పందిరి సమక్షంలో
ఇరువురి తనువుల ఒక్కటై
చేసిన ఆ నిశ్శబ్ద యుద్దం
మరు జన్మ వరకు శాశ్వతం
నాకెందుకో ఈ క్షణం వాస్తవం
కంటే ఆ నాటి జ్ఞాపకాలే
అమృత తుల్యం …
ఏమంటావ్ …ఓయ్…నిన్నే…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!