మధురమైన బాల్యం

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

మధురమైన బాల్యం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

ముత్యపు చిప్పలో దాగిన ముత్యాపు రాశుల వలె,
హృదయకుహరంలో దాగిన నిశ్శబ్ద జ్ఞాపకాల ఝరులు,
ఎన్నని చెప్పను, ఏమని చెప్పను
అమ్మ చూపిన ముద్దు మురిపాలు,
నిమిష నిమిషానికి అలిగి పట్టుదలతో సాధించుకున్న కోరికలు.
రామాలయంలో స్నేహబృందంతో చేసిన అల్లర్లు,
అల్లరిని ఆపడానికి గుడి యజమాని గుడిని,
గుడి వాహనాలను శుభ్రపరిస్తే
మార్కులు బాగా వస్తాయని చెప్పిన మాటలు నమ్మి,
పోటీలు పడి శుభ్రపరిచిన రోజులు.
మూడవ తరగతి నుండే తరగతి పుస్తకాలలో
ప్రభ,పత్రికలు పెట్టుకొని చదివి,
అన్నయ్యతో తిన్న చివాట్లు,
స్కూల్ గేట్ మూసేస్తే పార్కులో కూర్చుని,
అన్నయ్య ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తీరు,
చెప్పకుండా స్నేహితులతో సినిమాల కెళ్ళి,
అన్నయ్యతో చీవాట్లు తిన్న తీరు
ఎన్నో ఎన్నెన్నో తీయని జ్ఞాపకాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!