పువ్వులు(బాల పంచపదులు)

పువ్వులు(బాల పంచపదులు)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వరలక్ష్మి యనమండ్ర

సన్నాయి పాటల పున్నాగపూలు
భూమాతను తాకేను పారిజాతాలు
సాయంత్రం పూయును చంద్రకాంతలు
చంద్రకాంతికి మురియు కలువపూలు
సూర్యుని కాంతికి విరియు కమలములు…లక్ష్మీ

మధ్యాహ్నం విరియును మంకెనపూలు
ప్రతిరోజు పూయును నిత్యమల్లెలు
పరిమళాలు పెంచు లిల్లీపూలు
శ్రీకృష్ణుని కోసం పొగడపూవులు
మాలలు కడదామా మంచిమంచిపూలు…లక్ష్మీ

రంగురంగుల్లో నుండు చేమంతిపూలు
చిరునవ్వులు రువ్వును విరజాజిపూలు
మగువలకు ఇష్టం మల్లెపూవులు
సన్నని కాడలతో సన్నజాజిపూలు
కళకళలాడును కనకాంబరాలు….లక్ష్మీ

జడలు వేయుటకు మొగలిపూలు
సరిగమలరాగాల సంపెంగ పూలు
ప్రేమను తెలుపుటకు ఎర్ర గులాబీలు
అందమైనవీ మందారపూలు
అమ్మవారికిద్దాము అన్ని రంగుల పూలు…లక్ష్మీ

శివునికి ఇష్టం శంకుపూవులు
చిన్నిచిన్నివీ తుమ్మిపూవులు
బతుకమ్మకిద్దామూ తంగేడుపూవులు
గొబ్బెమ్మలపైన గుమ్మడిపూవులు
తోరణాలుకూ బంతిపూవులు…..లక్ష్మీ

విఘ్నేశ్వరునికిష్టం జిల్లేడుపూవులు
గంపలకొద్దీ పూయు గన్నేరుపూవులు
కళ్ళకు మంచివే నందివర్ధనపూలు
గుత్తులు గుత్తులు వెన్నముద్దపూలు
పసిపాపల నవ్వులు విరిసిన పూవులు….లక్ష్మీ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!