పూర్వ వైభవం

పూర్వ వైభవం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

అడ్డగిన్నెలో అన్నం వార్చి, వడ్డించినా
నడుం వాల్చ వీలులేక, నరకం చూసినా
ఇంటి నిండా జనం కిటకిటలాడుతున్నా
విసుగు, విరామం లేకుండా జీవించారు

స్వార్ధంతో మనసు నిండి పోలేదు ఆనాడు
నీది, నాది అన్న పొరపెచ్చాలకు తావులేదు
కష్టమో, సుఖమో అన్న ఆలోచన రానేలేదు
అండదండలు ముఖ్యమనుకున్నా ఆరోజు

భంధుత్వాలు కాదు భాగ్యము కావాలంటున్నారు
ఆప్తులతో పనిలేదు, ఆస్తిపాస్తులు చాలంటారు
ఉమ్మడి కుటుంబంతో వేగలేనంటారు,
స్వాతంత్య్ర భావాలు మాకు ముఖ్యమంటారు

ఆపదలు వస్తే, తలకిందులవుతారు
ఆనందం వస్తే, అవధులు మీరిపోతారు
అనుభవం కలిగిన పెద్దలను దూరం పెట్టారు
అక్కరకురాని వారు ఆదరిస్తారని నమ్మారు

ఇకనైనా ఉమ్మడి కుటుంబాలకు పలకాలి స్వాగతం
తరిగిపోదులే, నీకున్న స్వాతంత్య్రం
పెద్దదిక్కుగా మారి, పూర్వ వైభవం తెస్తారు
వేడుకోవద్దు అపరిచితులను ఆవాసం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!