విశ్వాసం

 విశ్వాసం

సావిత్రి కోవూరు 

అల్లారుముద్దుగా పెంచిన వారిని,
ఆటపాటలతోను పెరిగిన ఊరును,
అరగంట చూపులతో అమిత విశ్వాసంతో
నీ కరము గైకొని నిన్ననుసరించు.

మనువాడి నీ వెంట, నీ కడప జొచ్చి,
అడుగులో అడుగేసి నడిమింట నిలచి,
నీ ఇంటి దీపమై వెలుగులా నిచ్చు,
నీ బంధుమిత్రులను తన వారిగా తలచు,

సకల సేవలు చేసి, మీ వంశాభివృద్ధికై ప్రాణాలు ఒడ్డీ, నీ సంతోషానికై తన ఉనికి మరచి,
కష్టసుఖాలలో తోడునీడగ ఉండి,
కడదాక నీకు అండగా నిలిచు.

నీ చిరునవ్వుకై నిరతము వేచి,
నీ మెప్పుకై సతతము తపియించు,
అలసిసొలసి నీవు ఇల్లు చేరంగా,
చల్లని వెన్నెలగా ఎదురుగా వచ్చు.

సంసారం అన్నాక తగువులొస్తాయి,
ఆత్మాభిమానాలు ఆలి చెంతన వద్దు,
బంధుమిత్రుల ముందు తప్పులెంచొద్దు,
పదిమందిలోన పలుచన చేయొద్దు, పట్టువిడుపులే మీకు పరమ ఔషధమ్ము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!