అగ్గిపిడుగు
రచన:పిల్లి.హజరత్తయ్య
దేశభక్తి అత్తరును
నరనరాన రంగరించుకుని
దేశ స్వాతంత్ర్యానికై
ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన
ఉద్యమరూపము అల్లూరి..!
మోడుబారిన మన్యపు చెట్లకు
పచ్చని కాంతులను నింపుటకై
బ్రిటిష్ వారి గుండెల్లో నిదురించి
కంటిమీద కునుకులేకుండా చేసిన
మహా పరాక్రమరూపము అల్లూరి..!
గిరిజన గుండెల్లో
దైవముగా కొలువై
నమ్మినవారిని విడిపించుటకై
తుపాకీగుళ్ళవర్షానికి ఎదురొడ్డిన
అకుంఠిత సాహసము అల్లూరి..!
గెరిల్లా యుద్ధ విద్యల్లో
ఆరితేరిన అగ్గిపిడుగై
ఆంగ్లేయుల సామ్రాజ్యాన్ని ఢీకొట్టి
యువకుల ఆరాధ్యదైవమై నిలిచిన
మహోజ్వల రూపము అల్లూరి..!
***