ప్రేమ సౌందర్యము

(అంశము :: “ప్రేమ”)

ప్రేమ సౌందర్యము

రచయిత:: నారుమంచి  వాణి ప్రభాకరి

సూర్యోదయం వెలుగులు వేళ సర్వశుభాలు కలుగుతాయి.అందుకే ఆ సమయంలో సంగీత సాధన పూజ వంటివి చెయ్యడం ఎంతో మంచిది
రూప చాలా అందమైన అమ్మాయి వాళ్ళ నాన్న పెద్ద జమీందారు ఊళ్ళో మకుటం లేని మహారాజు కొడుకు లిద్దరుని సీ ఏ చదివించాడు. ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టవచ్చును లేదా పట్నంలో పెట్టవచ్చును.
ఇంజనీర్ డాక్టర్ చదివి దూరంగా వేరే సిటి వెళ్ళడం ఇష్టం లేదు రామలక్ష్మణుని లా దగ్గరలో ఉండాలి పంటలు పొలాలు అన్ని ఉన్నాయి అందుకే లోటు లేని జీవితం ధీటుగా ఇల్లు అంతా ఆధునిక పద్దతిలో మర్పించి పూర్వ కాలం మండువా ఇల్లు మారకుండా పైన అంతస్తులు వేసి ఎవరిది వారికి ఏర్పాటు చేశారు. పిల్లలుతో మాట్లాడితే ఉత్సాహభరితంగా అందుకు ఒప్పుకున్నారు కూడా అందరూ కలిసి భోజనం చేస్తారు పండుగలు చేస్తారు.ప్రేమ అభిమానం ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళకి ఉండి తీరాలి లేక పోతే ఈ ప్రపంచం ఇలా ఉండదు
ప్రేమ అనేది ఒక ప్రత్యేక అనుభూతి అది కలగడం కష్టం కని ఒకసారి కలిగితే మార్పు ఉండదు జీవిత కాలం ఉంటుంది
రూప మాత్రం తనకి మెడిసిన్ చెయ్యాలని ఉందని చెప్పింది.సరే దానికి కావాల్సిన కోచింగ్స్ తీసుకో నా ఫ్రెండ్ వైజాగ్ లో ఉన్నది ఆమె చాలా తెలివైనది.
అటు ప్రాక్టీస్ ఇటు కాలేజి ప్రొఫ్సరే కూడా వాళ్ళ ఆయన కూడా గవర్నమెంట్ డాక్టర్ కొడుకు కూతురు డాక్టర్ వాళ్ళ ఇంట్లో రూమ్లో ఉండి చదువుకుంటే మంచిదని చెప్పాడు అలాగే వాళ్ళకి ఫోనేచేసాడు ఎప్పుడు రావాలి
ఎంత ఖర్చు ఇత్యాదివి అన్ని కూడా కనుకొన్నాడు నీకేమి లోటు అన్ని ఉండి కూడా లెక్కలు వేస్తారని రూప తల్లి కాత్యాయని కోప్పడింది

ఇప్పుడంతా ఏటీఎం సర్వీసు అన్ని తెలిసి కూడా ఏమి తెలియని వాళ్ళల్లా మాట్లాడుతూ ఉంటారు అవతలి వారు తక్కువ అంచనా వేస్తారు

అయినా అన్నపూర్ణ గారు పెద్ద డాక్టర్ అవిడికి లోటు ఏమిటి?
అవసరం అయితే క్షణంలో బ్యాంక్ మేనేజర్ ఆవిడ ఇంటికి వస్తారు అని మందలించింది.
సరే అంటూ శ్రీ వేంకటేశ్వర రావు భార్య మాటకు వత్తాసు పలికాడు.అందరూ హాయిగా నవ్వుకొన్నారు రూపను తీసుకుని ఓ పట్టు చీర ,సఫారీ సెట్టు అరటి గెల పనస కాయ అవకాయ జాడి పట్టుకుని పూత రేకులు సున్ని ఉండలు ఓ పాతిక చొప్పున పట్టుకుని వెళ్ళాడు. అన్నపూర్ణమ్మకి మిఠాయి కాజ ఇష్టం అవి ఆ ఊరు వెళ్లి కొని పట్టుకెళ్ళడు

వావ్ పిల్లని కాలేజి కోచింగ్ కి తెచ్చవా పెళ్లి సారె పెట్టీ అత్త ఇంట్లో దింపా వెళ్ళడానికి వచ్చావా అని మొగుడు పెళ్ళాం నవ్వుతూ అడిగారు.
అబ్బే చాలా రోజులకు వచ్చాను కదా ఇంటి పంట అందుకు తెచ్చాను అని నవ్వాడు.

పిల్లని ఇప్పుడే చూస్తున్నాను చిన్నప్పుడు చూసాను ఈ మధ్యలో చూడలేదు అప్పుడుకూడా మీ చెల్లులు
కమల పెళ్లికి వచ్చాను అన్నది.
రూప అంతా మీ అమ్మగారు పోలిక ఆవిడ ఎలా ఉన్నారు?
అయినా నీ సంరక్షణలో అంతా బాగుంటారు. చక్కగా చూస్తావు.ఏమి లోటు అన్ని ఉన్నాయి అంది.

అవును మా అమ్మ నిన్ను తలుస్తునే ఉంటుంది. ఎంత పెద్ద చదువు ఆ రోజుల్లో చదివింది గొప్ప చదువు ఆడపిల్లను బాగా చదివించారు
అలాగని తల్లి తండ్రి మాట జవ దాట లేదు వాళ్ళు ఎవరిని చెపితే వాళ్ళను చేసుకుంది అలాగని వాళ్ళు తక్కువ చెయ్యలేదు డాక్టర్ని వేతికి చేశారు ఎప్పటికీ అన్న పూర్ణ చాలా కాలం పెళ్లి చేసుకోకుండా ఉంది ఎవరు రాస్తే దేముడు వాళ్ళు అవుతారని.ఆమె ధోరణి అలాగే తను పి జీ చేస్తుండగా ఆమె భర్త ఆమెకు ప్రొఫెసర్ రెండు మూడు సార్లు కదిపితే చదువు పూర్తి కావాలని అన్నది అలాగే అతను ఆమె అంగీకారం కోసం ఎదురు చూసాడు ఎన్ని సంభంధాలు వచ్చిన వద్దు నేను తరువాత చెపుతాను అనేవాడు ఇంటికి పెద్ద కొడుకు చెల్లెళ్ళ పెళ్లి చెయ్యమని చెప్పేవాడు.

కాలగమనంలో అన్నపూర్ణ తల్లి తండ్రి కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి ఊళ్ళో ఎవరు డాక్టర్ చదివిన పిల్లాడు లేడు పై ఊళ్ళో వెతకాలి అన్నప్పుడు ఆన్నపూర్ణ స్వరాజ్ గురించి తనను పెళ్లి ఆడుతానని చెప్పాడని చెప్పింది ఇంకనే నువ్వు ఆమాట ముందు చెప్పా వద్దా ఇప్పటికైనా చెప్పావు అంటూ వెంటే వాళ్ళ వాళ్ళను సంప్రదించి అన్నపూర్ణ పెళ్లి ఘనంగా చేశారు అప్పుడు అరిటి గెలలు పనసపళ్ళు సారే సరుకులో పసుపు కుంకుమ అడించి అన్ని శ్రీవేంకటేశ్వర రావు తల్లి తండ్రి పంపారు వాళ్ళకి వీళ్ళకి దగ్గర సంబంధం ఉంది. అయితే పూర్ణ చదువు కోసం వైజాగ్ వెళ్ళి ఆక్కడ సెటిల్ అయ్యారు మళ్లీ మధ్యలో పెళ్ళిళ్ళకి వచ్చి వెళ్ళేవారు వారింటి పిల్లల
పురుళ్లూ అన్ని అన్నపూర్ణ పోసింది. అల మరింత దగ్గర అయ్యారు ఇప్పుడు కూతురు రూపను ఆ చనువుతోనే పూర్ణ దగ్గర పెట్టి పెద్ద డాక్టర్ చెయ్యాలని ఆశ

రూపకు వాళ్ళింట్లో ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు భోజనం మాత్రం పూర్ణ ఇంట్లోనే , వాళ్ళ పిల్లలతో కలిసి మెలిసి ఉండేది
తెలియని విషయాలు చెప్పించుకునేది పూర్ణకి రూప కూడా బాగా నచ్చింది.
రూప పాటలు బాగా పాడేది. వాళ్ళ అమ్మ ఎంబ్రాయిడరీ డ్రస్సులు పెయింటింగ్ డ్రస్సులు కుట్టి పంపేది అవి బాగున్నాయి అంటే పూర్ణకు కూతురికి కూడా పంపేది రూప వంట కూడా బాగా నేర్చుకుంది ఎప్పుడైనా వంట మనిషి సెలవు పెడితే పూర్ణ కూడా ఉండి వంటకు సహాయం చేసేది అన్ని పనులు వచ్చును డాక్టర్ చదువుతోంది.మార్కులు కూడా బాగానే వస్తున్నాయి

కొడుకు అశ్వంత్ కి చేస్తే బాగుంటుంది కానీ వాడు ఏమి ఆలోచిస్తాడు తెలుసుకోవాలి.పిల్లకి ముందు చెయ్యాలి
ప్రేమ అనేది తాత్కాలికంగా ఉండకూడదు ఒకసారి ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితకాలం ఆనందంగా ఉండాలి.
కొందరు అందం చూసి ప్రేమిస్తారు కొందరు డబ్బు చూసి ప్రేమిస్తారు ఇంకొందరు అవకాశం కోసం మరి కొందరు
అవసరం కోసం ప్రేమిస్తారు. మనిషిని మనిషిగా ఎవరు ప్రేమించరు ఏదో ఒక రూపంలో మంచిని కోరి ప్రేమిస్తారు కొందరు వృద్ధ తల్లి తండ్రుల కోసం ప్రేమించాను నువ్వు లేకపోతే జీవితం లేదు అని చెపుతారు. ఆ పెళ్లి తరువాత వాళ్ళ స్వభావం బయట పడుతుంది ఇప్పటి కాలంలో ఒక్క పిల్లాడు ఒక్క పిల్ల కొడుకు విదేశాలు కూతురికి స్వదేశంలో పెళ్లి తల్లి తండ్రి భద్రత భాద్యతలు మావే అని చెపుతారు కానీ పెళ్లి తరువాత పరిస్తితి వేరేగా ఉంటుంది ఇలా ఎన్నో అవకాశ పెళ్లిళ్లు ఉన్నాయి

ఒకసారి పూర్ణ కూతుర్ని కొడుకుని కూర్చో పెట్టుకుని
మీ డాడీ ప్రేమ కథ వినండి అన్నది అదేమిటి మమ్మీ అన్నారు అవును రా నేను చెపుతాను

నేను మెడిసిన్ చదివేటప్పుడు ఒక బెంగాలీ ఆమె కూడా చదివింది నేను మంచి క్రికెట్ ప్లేయర్ కూడా ఆమె నా మెడల్స్, కప్పులు చూసి ఆనందపడి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది వాళ్ళు వచ్చి నన్ను చూసి మా అమ్మాయి నిన్ను ఇష్టపడుతోంది నీకు ఇష్టముంటే పెళ్లి చేస్తాము అమె నిన్ను ప్రేమించినట్లు చెప్పింది.ఎన్నో సంబంధాలు తెచ్చాను ఒప్పుకోలేదు అన్నారు.

అప్పుడు మీ డాడీ సార్ క్షమించాలి నాకు ఇద్దరు అక్కలు పెళ్లి కున్నారు కుటుంబభాధ్యతలు ఉన్నాయి నేను మీ డబ్బు హోదా ఆశించను నా కుటుంబం చూసుకోవాలి నేను కలకత్తా వచ్చి స్థిరపడటం కుదరదు.

మావి సంప్రదాయ సామాన్య కుటుంబాలు నాకు ఆటల కోటాలో మెడిసిన్ సిటీ వచ్చి చదువుతున్నాను నాకు మా అక్కల పెళ్లి అయ్యేవరకు ఆ ఆలోచన లేదు అని చెప్పారు ఆ పిల్ల చాలా భాధ పడింది.ఆతరువాత నన్ను తను ఇష్ట పడ్డట్టు చెప్పారు అయినా దైవనిర్ణయం ఉంది అయ్యింది

అలాగే ప్రేమించే ముందు కుటుంబ పరిస్థితిని బట్టి చూసుకుని ప్రేమించాలి.అంతేగానీ పెళ్లి పేరుతో కుటుంబాల్లో సంఘర్షణ ఉండకూడదు. తెలిసిందా
పెళ్లి ప్రేమించి చేసుకున్న చేసుకో పోయినా పెళ్లి తరువాత ఆ పిల్లని ప్రేమించి బాగా చూసుకుంటూ నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వాలి ప్రతి విషయానికి నిన్ను ఇష్టపడి చేసుకున్న నాకు ఏమీ వరుగింది కట్నం లేదు కనుక లేదు అంటూ నిత్య సంఘర్షణ ఎంతో మంది పడు తున్నారు అయితే అది పైకి చెప్పరు పైకి గొప్పగా ప్రేమ పెళ్లి అంటారు ప్రేమలో ఉన్న సౌందర్యము నిజానికీ పెళ్లి తరువాత చూపినదే ఈ జీవిత సత్యం గ్రహించిన నాడు ప్రేమ ఎప్పుడు అనృత తుల్యమే కదా జీవిత ము చాల చిన్నది అందులో కోపాలు కొట్టుకోవడాలు అలకలు ఆర్భాటాలు ఉండకూడదు. పుట్టుట గిట్టు ట నిజము నట్ట నడిమి పని నాటకము అన్ని శ్రీఅన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారం తెలుసుకుని పెళ్లి విషయంలో
ప్రేమించాను అనిచెప్పి పెళ్లి చేసుకున్న భార్యను చీ టీకి మాటికి సతయిస్తు దుర్వాసుడు లా కొప్పడుతు
సూర్యోదయం పాటు నస చక్రవర్తి లా కాక పుట్టింటి వదిలి నిన్ను ప్రేమించి వచ్చిన భార్యను ప్రేమగా చూస్తే నీ కుటుంబాన్ని అమె తన కుటుంబంగా చూస్తుంది తన వాళ్ళు గొప్పవారని తను ప్రేమించాను కనుక ఆమెకు పెళ్లి అయిందని లేక పోతే నీకు పెళ్లి అవదు అనే ప్రశంసలు విమర్శలు లేకుండా జీవితంలో ప్రేమ సౌందర్యం తెలుసుకోండి.
బెస్ట్ ఆఫ్ లక్
పూర్గ తన జీవితం పిల్లలకి చెప్పింది రూప అయింటికి సరిపోతుంది కనుక నువ్వు రూప ను ప్రేమించు ఎవరో ముక్కూ మొహం తెలియని పిల్లను చేసుకుంటే అమె నిన్ను తన వెంట రమ్మని విదేశాలకు వెళ్లి పోవాలి అంటుంది ఇది ప్రేమించే వయస్సు అని కొడుకుని మంద లించింది.

కాలగమనంలో రూప, అన్నపూర్ణ ఇంటికి సారేతో ఘనంగా కోడలిగా అడుగు పెట్టింది.
ప్రేమ రెండు కుటుంబాలను కలపాలి గానీ మనో సంఘర్షణకు తావివ్వకుండా ఉండాలి. కన్నతల్లితండ్రులను కట్టుకున్న భార్యను కూడా ప్రేమగా చూడాలి ప్రేమ అత్యంత విలువైన వస్తువు అది కొనడానికి దొరకదు కనుక అముల్యంగ అవతలి మనస్సు నుంచి పొందాలి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!