చివరి క్షణం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: రాధ ఓడూరి
కథ: చివరి క్షణం
రచన: రాము కోలా గారు
పార్వతమ్మ తన ముగ్గురు పిల్లలను సక్రమ మార్గంలో నడిపించి ఉన్నత విద్యావంతులను చేసి, వివాహాలు చేసి ఆస్తిలు కూడా సమానంగా పంచి తన జీవనాధారం కోసం కొంత ఆస్తిని తన పేరు మీద ఉంచుకుంది. కానీ ఆమె కుమారులు జల్సాలకు, విలాసాలుకు అలవాటై చేతిలో చిల్లిగవ్వ లేక తల్లి చెంత చేరగా ఆసమయంలో ఆమె మరణించి ఉంది. మరి కొడుకులు ఆమెని చితికి చేర్చారా లేదా ఈ కథలో తెలుసుకుందాం. తల్లి మరణవార్త విని పరుగున వచ్చారు…ఫణి, తేజస్వి, రవి. ఆ సమయంలో పార్వతమ్మ తమ్ముడి ఆలోచన ఒకలా ఉంది. ఉన్న ఆస్తి ఎవరి పేరు మీద రాసిందో తన పేరు మీద అయితే బాగుంటుందని మరో వైపు అమ్మ పేరు మీద ఉన్న ఆస్తిని తమ పేరు మీద రాస్తే బాగుంటుందని అని ఆలోచిస్తుండగా ఇంతలో పోస్ట్ మాన్ వచ్చి ఫణి, రవి, తేజస్వీ లు వచ్చి రిజిస్టర్ పోస్ట్ తీసుకోమనగా ఆత్రుత గా సంతకం చేసి కవర్ తీసికొని అందులో ఏముందో అనుకుంటూ చదవసాగారు. ఆ కవర్లో పార్వతమ్మ రాసిన ఉత్తరం వారి కనులు తెరిపించింది. అమ్మకి తమ మీద ఉన్న ప్రేమకి వారి కనులు కన్నీళ్లను కురిపించాయి.
ఆమె రాసిన సారాంశం…మీ మీద ఇంకా ప్రేమ ఉంది. మీరు చేసిన పనులకి నా పేరు మీద ఉన్న ఆస్తిని ఆనాధ శరణాలయాలకి ఇద్దామనుకున్నాను. కానీ కన్న ప్రేమ కదా! మిమ్మల్ని వదులుకోవాలని లేదు. అందుకే గార్మెమెంట్ షాపు పెట్టించాను. మీరు అందులో ఉద్యోగస్థులే. ఇకనైనా కష్టించి పని చేయండి..అది కూడా మీకు ఇష్టమైతే జాన్ మార్టిన్ ని కలవండి. తన పేరు మీదనే రాసాను. ఇది ఆమె రాసిన లేఖ తో కూడిన వీలునామా. నిజంగా ఈ కథ ప్రతీ ఒక్కరు చదవాల్సిన కథ. రాము కోలా గారి కథలు చదువుతున్నంతసేపూ కనులు అక్షరాల వైపు వైపు పరుగులు తీసాయి. అది ఆయన రచనా శైలి నైపుణ్యం.
చక్కని స్పందన తెలియచేసారు చెల్లాయి.
కథను పరిచయం చేసిన విధానం కొత్తగా ఉంది.
కథను పాఠకుడు చదవాలి అనేలా సమీక్షించడం ఇక్కడ ,ఎన్నుకున్న విధానం వైవిధ్యంగా సాగింది.
కథను గురించి చర్చిస్తూనే.
కథ స్వభావం వివరిస్తూ.కథ పూర్తిగా చదవాలి అనే ఉత్సుకతను కలిగించేలా,తక్కువ నిడివిలో చేసిన కథా సమిక్ష అద్బుతంగా ఉంది చెల్లాయి.
మీ ఆత్మీయతకు హృదయ పూర్వక అభినందనలు చెల్లాయి.
కథ కు తగి నట్టు సమీక్ష చక్కగా చెప్పారు. బాగుంది