వసుధ కౌముది

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

వసుధ కౌముది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

వసుధ, సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశం ధనుర్మాసం గా ప్రసిద్ది, శ్రీ వైష్ణావా ఆలయాలు శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ కేశవ స్వామి శ్రీ కృష్ణ స్వామి శ్రీ జనార్ధన స్వామి శ్రీ శ్రీనివాస స్వామి. సత్యనారాయణ స్వామి వంటి దేవాలయాల్లో తెల్లవారు కుండానే పూజలు చేసి బాల భోగం పెట్టీ ప్రసాదం పంచుతారు పరమాన్నం చక్రపొంగలి, కట్టు పొంగలి, పులిహోర, దద్దోజనం వంటివి ముఖ్య వంటకాలు. పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో ఇష్ట పడతారు. కౌముది మంచి సంగీతం ఇంట్లో క్లాసులు చెపుతుంది. కొడుకు కాశ్యప్ తో పాటు పిల్లలకి కూడా సంగీతం క్లాసులు చెపుతూ ఉంటుంది. అత్తగారు పూర్ణమ్మ కూడా కోడలిని చూసి ముచ్చట పడి చిన్నప్పుడు నేర్చుకున్న ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉంటుంది.  భక్తి తత్వ పాటలు ఏ వయస్సు వారికైనా పాడటం అదృష్టమే కదా, పూర్ణ తన సమయాన్ని పిల్లలకి భక్తి నీతి కథలు చెప్పాడని కేటాయించేది, కౌముది సంగీత పాఠం చెప్పాక బామ్మ గారి దగ్గర పిల్లలు కథలు వినేవారు.
బాల్యంలో నే అన్ని నేర్పి పిల్లలను మంచి మార్గం లోకి మార్చాలి  మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత ప్రక్రారము పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత పెద్దలదే కదా బాల వాక్కు ఎంతో మంచిగా ఉండేలా పెద్దలు నేర్పాలి బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని పెద్దలు అంటారు. అంటే వారు అన్న మాటలు సత్యమే కనుక అయ్యి తీరుతాయి. అందుకే పిల్లల నోటి వెంట మంచి మాటకు రావడానికి పెద్దలే మార్గ దర్శకులు వారు ఆకతాయి తనంగా ఉన్నా సరే వారిని మంచి మాటలు చెప్పి మార్చాలి పరుషు వాఖ్యం వాడ కూడదు వారికి అసలు అటువంటి మాటలు తెలియనియ్య కూడదు కూడా ఆవిధంగా పెద్దలు జాగ్రత్త తీసుకోవాలి, అందుకే పూర్ణ పిల్లల కోసం కొంత మందినైన మంచి మార్గంలోకి పెట్టాలని అనుకుంది ఇంటి భాద్యతలు కోడలు కౌముది కి అప్పా చెప్పింది. ఈ వయసులో కోడలితో జగడలు పడుతూ ఉంటే సుఖం ఏముంది తన అక్క అలా కోడలితో  గొడవ పడితే మనుమలు బామ్మనీ వృద్ద ఆశ్రమానికి పంపేశారు. నేటి తరం లో పిల్లలకి అనుకూలంగా పెద్దలు ఉండాలి. దానికి కారణం పెద్దల పెంపకము కదా, అందుకే పిల్లలు మంచి మాటలు మాట్లాడటం అలవాటు పడేలా చెయ్యాలి
దీనికి కొందరు పెద్దలు అయిన సరే ముందు కు రావాలి ఎంత సేపు ఉద్యోగం డబ్బు సంపాదన బ్యాంకులు నింపడం మా పిల్లలకి అది వచ్చు ఇది వచ్చు అంటూ గొప్పలు చెప్పడం కాదు భావి భారత పౌరులు గా తీర్చి దిద్దాలి. కౌముది కొడుకు కాశ్యప్ ను చిన్న చిన్న మాటలతో చక్కగా నీతి కథలు చెప్పేది.  ఒక సారి తండ్రి ఆఫీస్ నుంచి రావడం ఆలస్యమైంది. ఇంట్లో పూర్ణ తండ్రి రామం కూడా భయ పడ్డారు  ఏమిటి ? మన అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు వచ్చే ముందు ఏమి ? కావాలి అని మరీ అడిగి తెస్తాడు ఈరోజు ఎనిమిది దాటినా రాలేదు ఎందుకని ? అని భయపడ్డారు
అప్పుడు ఫోన్ చేస్తే నా ట్ రీచ్ బుల్ అని వచ్చింది. కొంచెం కంగారు పడ్డారు కౌముది కూడా రెండు సార్లు ఫోన్ చేసింది కానీ రిప్లై రాలేదు. ఆరోజు లంచ్ ఆఫీస్ లోనే అని హాట్ క్యారేజ్ పట్టుకెళ్ళ లేదు కూడా సరే ఎదో పనిలో ఉండి ఉండవచ్చును అనుకున్నది. అయినా మనసులో ఖంగారు పోలేదు అప్పుడు కాస్యప్ అమ్మ డాడీ ఇంకా రాలేదు ఎందుకని అని అడిగాడు. అదే ఖంగా రు  పడుతున్నాను అన్నది. అమ్మ భయ పడకు నేను ఉన్నాను గా మన డాడీ నీ కోసం ఎదురు చూస్తున్నా అని ఫోన్ చేస్తాను అన్నాడు సరే అని ఫోన్ ఇచ్చింది ముద్దు ముద్దు మాటలతో డాడీ నీకు భయం లేదు నేను ఉన్నాను మీరు ఏక్కడ ఉన్నారు?
రావాలి మీ కోసం ఎదురు చూస్తున్నాను  అంటూ ముద్దు ముద్దు మాటలతో పెద్ద అరిందాల చెప్పాడు
నువ్వు భయ పడకు జాగ్రత్తగా రా అన్ని నేను చూస్తాను అన్నాడు, నేను భాగవత పద్యాలు చదువుతాను. శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన పాడుతాను మా డాడీ జాగ్రత్త గా ఇంటికి వస్తారు అన్నాడు.
పిల్లాడి తెలివికి తల్లి  బామ్మ సంతోష పడి రెండు వేళ్ళు పట్టుకో ఇందులో ఒకటి అన్నారు అందులో వాహనం బాగాలేక ఆలస్యము ఆఫీస్ పని అని రెండు పెట్టుకున్నారు, అందులో వాహనం రిపేర్ అని పట్టు కొన్నాడు దానితో కొంత స్థిమిత పడ్డారు ఎనిమిది న్నర దాటు తుండగ ఫో న్ వచ్చింది.
ఆడిట్ నిమిత్తం వేరే ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చింది వచ్చే టప్పు డు వాహనం రిపేర్ వచ్చింది దగ్గరలో ఎక్కడ షేడ్ లేదు అక్కడ సిగ్నల్స్ లేవు అందుకని ఏ విషయం చెప్పలేక పోయాను ఇప్పుడు సిటీకి దగ్గరగా వచ్చాను సిగ్నల్ వచ్చింది విషయం చెపుతున్నా ఇంకా రెండు గంటలు పడుతుంది మీరు భోజనం చేసేయండి  అమ్మ, నాన్న నీ కంగారు  పడవద్దని చెప్పు అని కౌముది కి చెప్పాడు.
పిల్లలని సంస్కార వంతంగా పెంచడం వల్ల క్లిష్ట పరిస్థితులు కూడా నీతి కథలు ఆధ్యాత్మికత వల్ల విజ్ఞతతో ఆలోచించి ఆ కథలో అలాగ ఈ కథలో ఇలాగ అంటూ అమ్మకి మాటలు చెప్పాడు కాశ్యప్ బాల వాక్కు బ్రహ్మ వాక్కు గా పెద్దలకి ఒక ఆనందం కలిగింది పిల్లలకి మంచి మార్గం పెద్దల నుంచి నీతి కథల నుంచి అని తెలుసుకుని పిల్లలని పెంచాలి అప్పుడు మంచి యువత వస్తుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!