చిత్రం అయ్యారే విచిత్రం!

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

చిత్రం అయ్యారే విచిత్రం!

రచన:: కవి రమ్య

చిత్రం ఆయ్ భళారే విచిత్రం,
నీ ప్రేమ మాయ బహు చిత్రం,
నీ చెంత చేరగనే గుండె లయ వేగం,
నీ అడుగుల సవ్వడి మనసులో మీటెనే మోహనరాగం,
నీ పలుకులు హృదాయనికి తెచ్చెనే వింత సంబరం,
నీ గుప్పెడు గుండె ఎద చప్పుడు నా మనసుకి వేణు గానం,
చిత్రాతి చిత్రం ఈ ప్రేమ అను బంధం,
ఇద్దరి గుండెల్లో అల్లేసింది తెలియని భావం,
ఇరువురి భావాలు జతకలిసి చేరేనే సంగమం,
మొన్నటివరకు ఎవరికి ఎవరం,
ప్రేమతో అయ్యాం ఒకరికొకరం,
ఓ ప్రేమా! నీకు దాసోహం,
మనుషులతో నీ ఆట బహు చిత్రం,
మనసులో పాడేవు మనోహర స్వరం,
నేను, నువ్వు తో మొదలయ్యి అయ్యాము ప్రేమ వల్ల మనం!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!