రంగుల వలయం

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

రంగుల వలయం

రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు

చిత్రమే ఇది విచిత్రమే భళారే విచిత్రమే
ఇది రంగలమయమైన జీవితమే
కడురసరమ్యజీవనమే
కానరాదెన్నడూ కడు విచిత్రమే!
ప్రేమ ప్రేమంటు పెళ్ళిచేసుకుంటారు
పడకగదిలోనే పంతాలు పడతారు
మరుచటిరోజే నీకు నాకు చెల్లంటారు
చిత్రమే ..భళారే విచిత్రమే!
అమ్మనాన్నలే దేవుళ్ళని చిన్నప్పటి మాట
పెదవ్వగానే పరాయివారేనట
ఎక్కడోదూరంగా తానుంటాడు
వృధ్ధాశ్రమంలో వీరుంటారు!
రాజకీయమే మేలని రచ్చగెలుస్తారు
ఇంటిలోనే వేరుకుంపట్లు పెడతారు
ప్రజాస్వామ్యంమంటె ఇదేనంటారు
చిత్రమే…భళారే విచిత్రమే!
కట్నాలు వద్దంటారు
పెళ్ళిమాత్రం బాగా చెయ్యమంటారు
ఖానాలు పీనాలు గానాభజానాలు
వాటికే చాల్లేదు డబ్బంటారు!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!