(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)
కాలం చేసిన గాయం
రచన:: సుజాత.కోకిల
వివాహ బంధంతో ఒక్కటైన జంట
నూరేండ్లు జీవించే జీవితాలు
కాలం చేసిన గాయంతో
అందరూ ఉండి అనాథలా
కనుల ముందే కాలగమనంలో
కలిసి పోతుంటే చూసి భరించడం
ఎవరు ఊహించని విచిత్రమే కద
కనులముందే అన్ని ఘోరాలు జరుగుతుంటే అందరం ఉండి ఏం చేయగలుగుతున్నాం ఎవరూ ఊహించని విచిత్రమే కదా
చిత్రం భళారే విచిత్రంగా వచ్చిన రోగాలకు
వైద్యులకే అంతు పట్టని రోగాలకు
మందులెే లేవంటున్న వైద్యులు అంతుచిక్కని రోగాలతో అతలాకుతలమైన జనాలు డబ్బు హోదా నుండి కూడా ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్నాయి విచిత్రమైన రోగాలు ఇవి చిత్రం భళారే
విచిత్రమే కద ఇంకా ఎన్ని చిత్రాలు విచిత్రాలు జరగనున్నాయో కద ముందున్నది ఎవరు
ఊహిస్తారు.కాలంతో పాటుగా
మనం ముందుకు నడవాలి.