రాబోయే ఆకలి కాలం

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

రాబోయే ఆకలి కాలం

రచన:: వెంకట శివ కుమార్ కాకు

ఆకలి ఎంతటి చిత్రం
ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి
చేతులు కడుపుకి ఆసరా అవుతాయి
ఈ ప్రపంచంలో ఆ సమయం లో
ఎవరికైనా ఇంకేం కావాలి?
రెండు ముద్దలు నోట్లో కి తప్ప !
డబ్బు బంగారం ఆస్తులు గర్వం ధర్పం కాదు
ఎప్పుడైనా ఈ సమస్త జగతి ని కదిలించేది
అందరినీ నడిపించే శక్తి ఆకలి ఒక్కటే
అందుకే ఆకలి అనేది చిత్రం … భళారే విచిత్రం !!

తన ఇంట్లో ఆకలి చావులు దాటి
ఎండిన పొలంని తన కన్నీటి తో దున్ని
కంటి పాపలా పండిన పంట ని కాపాడి
అలా అహర్నిశలూ శ్రమించి పండించినవాడే
రెండు పూట్ల పస్తులు పడుకుంటూ వుంటే
తను గుడిసెలో పేదవాడి గా గంజి తాగుతూ
ఇంకొందరు ఆ అన్నం తింటూ బెంజిలో తూగుతూ
మనిషి ఇరవై అంతస్తుల మిద్దెలపై నివసించినా
పొడవాటి వంతెనలు పై విహరించినా
ఎంతటి గొప్ప నగరాలు నిర్మించినా
పండించేందుకు నేల మిగలనప్పుడు
పండించే రైతు ఎప్పటికీ ఓడిపోతున్నప్పుడు
ఏదో ఒక రోజు ఆకలి గెలిచి
నగరాల్ని సమాధులగా మార్చదా
అందుకే బ్రతుకు అనేది చిత్రం … భళారే విచిత్రం !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!