జీవన విధానం

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

జీవన విధానం 

రచన:: పి. వి. యన్. కృష్ణవేణి

ఆరడుగుల దేహం మనది
ఏ మూలనో ప్రాణం ఇమిడింది
మనసున భావాలు వేలకొలది
అల్లుకున్న భందం సుతిమెత్తనిది

ప్రేమ మాత్రమే నాకు చాలంటుంది
డబ్బుతో పని తనకు లేదంటుంది
సంతృప్తితో జీవిస్తానంటుంది
ఆత్మబలం శ్రేయస్కరమంటుంది

మనిషీకి మాత్రం తృప్తి లేదు
అదేమి వింతో తెలియదు
అదేమి… చిత్రం… భళారే విచిత్రం
దేవుడు చేసిన మనిషీ ఓ చిత్రం

మదిని మురిపించే చిత్రాలెన్నో
భాషకు అందని విచిత్రాలేన్నో
అమ్మ గర్భాన పుట్టే జీవి ఓ చిత్రం
హద్దేలేని నింగి సూర్యుడు విచిత్రం

ప్రకృతిలో ప్రతి సన్నివేశం నాకిష్టమే
దేవుడుమలచిన జీవులు నాకిష్టమే
తృప్తి చెందని మనసుతో కష్టమే
నిన్ను నువ్వు తెలుసుకోకపోవటమే
నష్టమే

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!