సప్త వర్ణాల హరివిల్లు
రచన: పరిమళ కళ్యాణ్
సప్తవర్ణాల సమ్మిళితం ఇంద్రధనుస్సు
భావోద్వేగాల సమ్మేళనం మన మనస్సు
వాన వెరిస్తే విరిసెను ఇంద్రధనుస్సు
బాధ తీరితే మురిసెను మనస్సు
ప్రకృతిలో సహజ అందం ఇంద్రధనుస్సు
ప్రకృతి అందాన్ని చూసి పులకించెను మనస్సు
హరివిల్లు చూసి నెమలి పురివిప్పి నాట్యమాడింది
కురిసిన వానకి రైతు మనసు నాట్యమాడింది
పసిపాపల బోసినవ్వులు హరివిల్లు లోని వర్ణాలు
ప్రేమ నిండిన బొమ్మరిల్లే మమతల పొదరిల్లు
పుడమితల్లి సోయగాన్ని చూసి ఉప్పొంగిన
వరుణుడు విసిరిన వలపుబాణం హరివిల్లు
మబ్బుతెరలు తొలగగానే మనసుదోచే ప్రతిబింబం
ఆ దృశ్యం చూపరులకు కడు రమణీయకరం
