గంగరాజు పెళ్ళి

గంగరాజు పెళ్ళి

దోసపాటి వెంకటరామచంద్రరావు

గంగరాజుకి ఇంకా పెళ్ళికాలేదు. కాకపోవడానికి కారణాలంటూ ప్రత్యేకంగా ఎమీలేవండి. సరియైన సంబంధం దొరకటం లేదని అనలేమండి. అలాగని
గంగరాజేమి అనకారికాదండి. అంగవైకల్యము లేదండి. ఉద్యోగం కూడా రెండుచేతులా సంపాదించేదేనండి.
తాహశీల్దారు ఆఫిసులో రెవెన్యూఇన్సెపెక్టర్ ఉద్యోగం. నాన్నగారు లేరండి. అమ్మగారున్నారండి. అమ్మగారికి
పెద్దచదువులు చదివిన అమ్మాయికోడలుగా రావడం ఇష్టంలేదండి. ఎందుకంటే తన మాటలు వినదని. అలాగని చదువు సంధ్యలు లేని అమ్మాయి కూడా ఇష్టంలేదండి. తనలాగా డిగ్రీపూర్తి చేయకుండా ఉన్నా పర్వాలేదు.
ఇక గంగరాజు సంగతికి వద్దాం. గంగరాజు ఎదో డిగ్రీ అయిందనిపించాడండి. వాళ్ళ నాన్నాగారు బ్రతికి ఉన్నప్పుడు తాహశిల్దారుగా పనిచేశారండి. ఆయన
తన పలుకుబడిని ఉపయోగించి తాహశిల్దారు ఆఫిసులోనే చిన్న ఉద్యోగం వేయించారండి. కొంచెం లంచజ్ఞానం ఉండడంతో పై అధికారుల మెప్పు పొందుతూ రెవెన్యూఇన్సెపెక్టర్ కాగలిగాడండి.
ఇప్పుడు తను లంచావతారం ఎత్తి రెండుచేతులా
సంపాదిస్తున్నాడండి. తన ఎదో డిగ్రీ వరకు చదువుకున్నాడు గనుక తన కంటే తక్కువ చదువుకునే అమ్మాయైతే చాలనుకుంటున్నాడండి.
ఈ రోజుల్లో అసలే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. అందులోను ఉన్నవాళ్ళలో అందరు పెద్దపెద్దచదువులు చదువుకున్నవారేను. తక్కవ చదువుకున్న అమ్మాయిలు దొరకటంలేదు. పెద్దచదువులు చదుకున్నవాళ్ళు తనని ఎందుకు చేసుకుంటారండి. ఓ నాలుగు మెట్రమోనియల్ గ్రూపులలో తన వివరాలన్ని పెట్టెశాడండి. అలాగే గంగరాజు అమ్మగారుకూడా ఆవిడ కూడా కొన్ని గ్రూపులలో పెట్టిందండి. ఇవేకాక
పేపర్లో పడే పెళ్ళికూతుర్ల వివరాలు కూడా తిరగేస్తుంటారండి తల్లి కొడుకునూ. పోని బంధువులలో అమ్మాయిలున్నారంటే అందరూ పెద్లపెద్దచదువులు పెద్ద ఉద్యోగాలునూ. అటువైపునుంచి కూడా గంగరాజుకి సరియైనజోడి దొరకటంలేదండి. ఇప్పుడు గంగరాజు పెళ్ళి అటూ గంగరాజు ఇంట్లోనూ ఇటు ఆఫిసులోను ఒక చర్చాంశమైపొయిందంటే నమ్మండి. గంగరాజుకి స్నేహితులున్నారండి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసేసుకొని ఆనందంగా పిల్లాపాపలతో ఆనందంగా
గడిపేస్తున్నారండి. అదికూడా గంగరాజుకి తల తీసేసినట్టుందండి. వాళ్ళిప్పుడు గంగరాజుతో కలవడమేలేదండి. ఎప్పడైనా ఫోనుచేస్తే తీరీకలేదంటు తరువాత మాట్లాడతానంటూ ఫోన్లు పెట్టెస్తున్నారండి.
తల్లికొడుకులబాధని పొగొట్టే వారే లేరండి. ఇదిలా ఉండగా గంగరాజు అదృష్టమనుకోండి లేక కాకతాళియమనుకోండి కొత్తగా ఒక అమ్మాయి వాళ్ళ ఆఫిసులో జాయినయ్యిందండి. ఆ అమ్మాయి
గంగరాజు లాగే డిగ్రీ వరకే చదివిందండి. పెద్ద అందగత్తె కాక పోయిన పర్వలేదనుకున్నాడండి గంగరాజు.
ఆ అమ్మాయితో పరిచయం పెంచుకునే ప్రయత్నాలలో పడ్డాడండి గంగరాజు. ఆ అమ్మాయికి ఇల్లు కావాలంటే
వాళ్ళ వీధిలోనే వాళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఇల్లోకటి అద్దెకు చూశాడండి. ఇక వాళ్ళ అమ్మగారితో పరిచయం చేయించాడు. గంగరాజు వాళ్ళ అమ్మగారు కూడా ఆ అమ్మాయితో కలుపుగోలుగా వుంటూ ఆమె వివరాలన్నీ కూపిలాగేసింది. పోనీ ఈ
అమ్మాయైనా గంగరాజుని పెళ్ళిచేసుకుంటే బాగుణ్ణుఅని. ఇక ముసుగలో గుద్దులాట ఎందుకని వాళ్ళూరెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులతో మాటలాడేసిందండి. వాళ్ళుకూడా ఇద్దరూ ఒకే చోట
ఉద్యోగాలు చేస్తున్నారని సరేననకుండా అమ్మాయితో మాట్లాడి చెబుతామని అన్నారండి. మరో ఆరునెలలు
పోతేగాని అమ్మాయికి పెళ్ళిచేసే ఉద్దేశం లేదన్నారండి. ఇన్నాళ్ళు ఆగేము మరో ఆర్నెల్లు ఆగలేమా అనుకుంటూ ఈ ఆర్నెల్లలో అమ్మాయితో మాటకదిపి మెల్లగా తోవలోకి తెచ్చుకోవచ్చనుకుని గంగరాజుకి విషయాన్నంత పూసగుచ్చినట్టు చెప్పేసింది. గంగరాజు చాలా సంతోపడిపోయాడు.
మరింత చొరవగా ఆ అమ్మాయితో మెలగసాగేడు.
ఆర్నెల్లు కావొస్తోందని గంగరాజు తల్లి మళ్ళి ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళి సంబంధం కాయంచేసుకుందామనుకొని బయలుదేరింది. ఇంతలోనే ఆ అమ్మాయి పక్కన ఇంకో యువకుడితో వచ్చి కాళ్ళకు దండం పెడుతూ దీవించమంది. గంగరాజు అమ్మకి గంగరాజుకి స్ప్రహ వచ్చేంత పనైంది. ఇక గంగరాజు పెళ్ళి అయ్యెదెప్పుడు? కధ మళ్ళి మొదటికే వచ్చింది కదండి.
****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!