కవిభూషణుడు

కవిభూషణుడు

(సినారె గారి వర్ధంతి సందర్భంగా )

రచన::జె.వి.కుమార్ చేపూరి

 శ్రీ సింగిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ బిడ్డ
తెలుగు సాహిత్య వనంలో తన పేరు దొడ్డ
ఉర్దూ భాషలోనూ తానూ తిరుగులేని దిట్ట
పొందెను తెలుగు భాషలో డాక్టరేటు పట్టా

ఉపన్యాసకునిగ ఉపాధికి శ్రీకారం
సర్వసాహిత్య రచనకు తాను ప్రాకారం
తన పురస్కారాలకు లేదు కొలమానం
వరించె తనను పద్మశ్రీ, పద్మభూషణం

అరవయ్యో దశాబ్దంలో సినిమారంగం ప్రవేశం
నన్ను దోచుకుందువటే పాటతో సుస్థిరస్థానం
ఇక ఆపై సినిమాల్లో తాను పట్టినదల్లా బంగారం
అందు వీనులవిందైన పాటలు గలవు సహస్రం

విశ్వంభర కావ్యానికందుకునె జ్ఞానపీఠం
రాజ్యసభను సైతం అలంకరించిన కవిరత్నం
వర్ధంతి వేళ ఆ పద్మభూషణుని స్మరణం
తన సాహిత్యసేవలకు మనమిచ్చే గౌరవం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!