తల్లి
రచన::శాంతి కృష్ణ
తల్లిని కానని తెలిసి
తల్లడిల్లిన నాకు
తల్లియై తండ్రియై
తోడు నీడగా మారి
తనువుల బంధం కాదని
తన మనసుని నేనని
తలపుల వ్యధలను వదిలించి
తానే నా శిశువుగా మారి
తల్లడిల్లిన నను కౌగిలించుకొనె!
తమకపు కౌగిలి కాదది
తల్లి స్పర్శ లోని ప్రేమ
తండ్రి బాహువుల భరోసా
తరగని ప్రేమ చూపించే తనని
తల్లినై కలకాలం లాలించనా
తనివితీరా బుజ్జగించనా.
