తెలంగాణబతుకుచిత్రం

తెలంగాణబతుకుచిత్రం

రచన: ఐశ్వర్య రెడ్డి

ఏండ్లు గడచిన తీరని వ్యదలు

తెలంగాణ వచ్చిన మారని బతుకులు

బంధుప్రీతి తో నేతలు
బ్రష్టు పట్టించేను పాలనను

భూముల కోసం రాబందుల ఆరాటం
బువ్వ కోసం పేదోడి బతుకు పోరాటం

మూలాలు మరిచిన మానవ కులం
బీటలు వారిన రక్తసంబంధం

బాధ్యత లేని జీవితాల చిత్రం
విముక్తి దొరకని బతుకుల రణం

మారాలి పేదోడి జీవితం
అభివృద్ధి కై చేయాలి తపం

ఏ రంగానా చూసినా ఏమున్నది గర్వ కారణం
సవాలు విసిరే స్వార్థపు బడా  బలం

రావాలి రావాలి మహోభ్యూదయ తెలంగాణం విరియాలి విరియాలి సంతోషం సంబరం

బతుకమ్మ పాటై  పసిపాప నవ్వై
బోనాల జాతరై విలసిల్లాలి
మన తెలంగాణం.
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!