ఇల్లాలి మనసు

ఇల్లాలి మనసు

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

ఏమిటో అర్థం చేసుకోరు ఏవ్వరు
ఏమి చేయాలో తెలియట్లేదు
మానసిక సంఘర్షణ.

ఎందుకు ఈ మానసిక సంఘర్షణ
ఎవరికోసం నా అనుకునే వాళ్ళు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు ,

మార్నింగ్  నుండి వీళ్ళ కోసమే కదా నేను చాకిరీ చేసేది
పొద్దున లేస్తే హడావిడిగా ఎవరి  పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు
ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను ,
వాళ్లకి ఎన్నో ప్రపంచాలు
కానీ నాకు వాళ్ళే  ప్రపంచం
ఏంటో ఆడవాల్ల బ్రతుకులు అందరివి ఇంతేనా
నా బ్రతుకే ఇలా నా ..
వారికి ఏ టిఫిన్ ఇష్టం ఏ కూర కావాలి ఏం వండాలి,
ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాను
కానీ వాళ్ళు ఒక్క రోజు  నాకోసం ఒక పావు గంట టైం ఎవరు  కేటాయించరు,
ఇప్పుడు నా పిల్లలు పెద్ద వాళ్ళయి కాలేజీలకి వెళ్తున్నారు.
ఎప్పుడో చిన్నప్పుడు మా వారితో పెళ్లి చేసుకొని వచ్చేశాను.
పొద్దున లేస్తే ఎవరి బిజీ వాళ్లది వెళ్ళిపోతారు పొద్దుట,
సాయంత్రం ఎప్పుడో వస్తారు .

నాతో వాళ్ళ అవసరానికి తప్ప పెద్దగా మాట్లాడరు.
వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను రోజంతా,
వాళ్లకు హాలిడే ఉన్న నేను కనబడను
ఫోన్ లు టీవీ లు మాత్రమే కనబడతాయి
ఏమిటో జీవితం ..

ఇంక మా వారైతే మరిను…..
అసలు ఈ మధ్యలో  ఇంట్లో ఉన్న ఇద్దరం కలిసి ఉన్న దూరంగానే ఉన్నాం అన్న ఫీలింగ్
శారీరకంగా మానసికంగా ఎందుకు దూరమయ్యాము,
ఏమన్నా అంటే ఆఫీస్ టెన్షన్ అంటారు
ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడితే  ప్రేమ గా ఉంటేనే కదా ఏదైనా తెలుస్తుంది .. అవతలివారి గురించి,
ఫోన్లు లాప్ టాప్ లు ముందు వేసుకొని కూర్చుంటే నేనెలా కనబడతాను, నా ప్రేమ ఎలా కనబడుతుంది.
ఆయన ఎప్పుడు మాట్లాడతారా నన్ను ఎప్పుడు పిలుస్తారా అని తపిస్తూ ఉంటాను,
పిలుస్తారు కాని నాకోసం కాదు,ఇది ఎక్కడ ఉంది ,అది ఎక్కడ ఉంది అని అడగడానికి మాత్రమే.

పిల్లలు కూడా అంతే
అమ్మా అది ఎక్కడ ఇది ఎక్కడ అంతే
ఆ వస్తువులను వారికిస్తే నాతో వారికి పని ఐపోయునట్టే.

అంతేగాని నా తోటి కూర్చుని నా మంచి చెడు అడగడానికి ఎవరికి టైం ఉండదు ,
నా లోపల ప్రశ్నలకు నేనే సమాధానం చెప్పుకోవాలి,

ఏమిటో జీవితం ఇలా తయారైంది
నా బాధను ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు .
నేను ఒక రోజు లేకపోతే వారి కి గడవదు,
ఒక్క రోజు నాకు జ్వరం వస్తే నే అందరికీ విసుగు కోపం ఎందుకో మరి అర్థం చేసుకోరు నన్ను,
నేను ఇంట్లో ఉండాలి ఇల్లు సర్దడానికి వాళ్ళ పనులు చేయడానికి.

కానీ నాకంటూ ఒక మనసు ఉంది , నాకు కొన్ని కోరికలు ఆశలు ఉంటాయని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు.

ఎవరికి నేను ఇప్పుడు అవసరం లేదు ఒక్క వండిపెట్టడానికి ఇంటి చాకిరీ చేయడానికి తప్ప ,
నా మనసు బాధ నా శరీర బాధ అర్థం చేసుకునే వారు ఎవరు…..
అర్థం చేసుకునే వారు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు
ఏప్పుడన్నా మాట్లాడదామని ప్రయత్నిస్తే
ఇప్పుడు కాదు నేను చాలా బిజీగా ఉన్నాను,
తర్వాత ఎప్పుడైనా మాట్లాడదామని చెబుతారు
మా వారు,
వారే అర్థం చేసుకో పోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు .

అందరితో సంతోషంగా ఉండాలి ,
నవ్వుతూ ఉండాలి అని అనుకుంటాను,
కలలుకంటాను ,
కానీ ఏమో ఆ కల తీరుతుందా ఎప్పుడు బిజీ బిజీ బతుకులతో పక్కనున్న మనిషి మనసులో ఏముందో తెలుసుకోరు ఇప్పటి మనుషుల తీరే ఇంతేనేమో,

కాంక్రీట్ జంగల్ లో ఉండి వీళ్లు కూడా మనసులేని జంతువుల్లా తయారయ్యారేమో….

ఏమో కావచ్చునేమో…….
అందుకే అర్థం చేసుకోరేమో….
నా మనసు లోని వేదన
ఓఇల్లాలి మూగ రోదన…………………

You May Also Like

2 thoughts on “ఇల్లాలి మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!