గుండెచప్పుడు

గుండెచప్పుడు

పిల్లి.హజరత్తయ్య

మూడు పువ్వులు ఆరుకాయలుగా
దాంపత్య బంధం భాసిల్లాలంటే
చిగురులోనే మొగ్గ తొడగాలి..!

సంసార జీవితం దివిటీలా
ఆనందపు కాంతులను వెదజల్లుతూ
చిలకా గోరింకల్లా ఒదిగిపోవాలి..!

పచ్చదనపు ప్రకృతి హారంలా
ఒకరికోసం మరొకరు అన్నట్లు
పాలు నీళ్లులాగా కలిసిపోవాలి..!

మమతాను బంధాలు బలపడేలా
ప్రేమను పెంచే గిల్లికజ్జాల్లా
కలుపుగోలుగా మమేకమై పోవాలి..!

సమస్యల సుడిగుండాన్ని ఛేదించేలా
ఆలుమగల బంధానికి భాష్యం చెప్పేలా
తోడు నీడగా నిలిచిపోవాలి..!

ఒకరినొకరు అర్థం చేసుకుని
కష్టసుఖాల్లో పాలుపంచుకునే విధంగా
రెండు కుటుంబాలు ఏకమవ్వాలి..!

మధురానుభూతుల్ని ఆస్వాదించడానికి
దేహాలు వేరైనా గుండెచప్పుడు ఒక్కటవ్వాలి..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!