చేనులో కర్షకుడు

చేనులో కర్షకుడు

రచన: సాయి ప్రసాద్. గోపు

ఆకాశంలో మేఘాలకు ఎవరో పరుగు పందెం
పెట్టారేమో!
మేఘాలు వడి వడి గా పరుగెత్తుతున్నాయి
ఒకదానితో ఒకటి ఢీకొట్టుతు శబ్దలు చేస్తున్నాయి
శబ్దాలకు భయంతో ఉరుకులు పరుగులు చేస్తున్నాయి
జీవపక్షాజాతులు
పందెంలో నీటిబిందెలు ఆకాశంలో వెలుతురు వేదజల్లుతుంటే
వెలుతురు వెదజల్లే ఆకాశంలో , భువిపై దడుకుతో మనుషులు గూడు చేరుతుంటే
గాలివానల కు వృక్షాలు నాట్యం ఆడుతుంటే
నేలపై పస్క మోలుస్తుంటే నేల శుద్ధి చేయ రైతన్న కదులుతుంటే
చేనులో కర్షకుడి అరుపులు గొప్ప సంగీత విద్వాంసుడీలా వినబడుతుంటే
అరక మోస్తున్న కంకలు సాళ్ళు వేస్తుంటే
కర్సకుడి ఇల్లాలు విత్తనాలు వితుంటే
నలుదిక్కుల పచ్చని పైరు చల్లగా స్వాగతం పలుకుతుంటే
చేను చెల్కలో అవ్వలు పాటలు పాడుతూ కలుపు తీస్తుంటే
ప్రకృతి అంత పచ్చని చీరతో చింగరించుకొని ముస్తాబు అయినట్టు కనబడుతుంది…
కనువిందు చేసే ప్రకృతి అందంగా కనబడే చేను చెలకులు కమ్మని కోయిల రాగలతో ఎంతో రమ్యంగా కానడుతుందో
వర్షానికి స్వాగతం పలుకుతూ అన్నదాత ముఖాన చిరునవ్వు లు తెస్తూ పాడి పంట పండలని కోరుకుంటూ.. మీ సాయి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!