సార్ధకత

సార్ధకత

రచన: మక్కువ. అరుణకుమారి

ఆగిరులు పుట్టేది జలధార పంచేందుకే
ఆఝరులు పారేది దప్పికలు తీర్చేందుకే

ఆతరులు ఉండేది అందరికి అక్కరకొరకు
ఆవిరులు పూసేది దేవునికి చేరేందుకే

ఆతేరు వర్షాలు పంటలకు అందించె
ప్రకృతిలో మానవులు
ఫలాలను పొందేందుకే

ఆసిరులు అందరికి సుఖశాంతి నందించు
ఆనరులు బతికేది మానవత పంచేందుకే

చందురుడు వెన్నెల మనస్సును దోచేను
ఆ ‘అరుణ’ తాకేది తిమిరాన్ని తరిమేందుకే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!