ప్రేమబంధం

వ్యాసం: ఐచ్చికం

ప్రేమబంధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

వ్యాసకర్త: పుష్పాంజలి

   ఎంతా చెప్పిన ఎన్ని  మాట్లాడినా ప్రేమ అనే పదం గురించి కవులు వర్ణనలు కూడ సరిపొదు. ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో మజీలలు ప్రతివ్యక్తి  జీవితంలో రెండు హృదయాల స్పందన  మనకు తెలియకుండా జరిగే ప్రకియ. పుట్టినప్పుడు ఎదో తల్లితండ్రులతో బంధం, తన ఆటవస్తువులతో అనుబంధం ఆ తరువాత పాఠశాలతో అనుబంధం స్నేహితులు తోటి పుస్తకాల తోటి  అనుబంధం. ఆ తరువాత పెరిగి పెద్దాయిన తరువాత ప్రేయసి ప్రియుల మధ్య అనుబంధం అదే ప్రేమబంధ అది సక్సెస్ అయితే ఒక ప్రయాణం అదే పెళ్ళి అనే బంధం. అభినయ తన ఉండే చిన్న టౌనులో ఇంటర్ వరుకు చదవు ముగించి ప్రక్కనే వున్నా సిటీలో ఇంజనీరింగ్ వద్దు అనుకొని డ్రీగీలో జాయిన్ అయింది. అభినయ అందమైనది అంతా తెల్లటి తెలుపుతో కాకుండా మంచి రంగు అని చెప్పవచ్చు  కళ గల ముఖం చాల చక్కగా వుంటుంది చదువులో చురుగ్గా వుంటుంది. కళాశాలలో జాయిన్ అయిన తరువాత రోజు ప్రక్కన వున్నా సిటీ కి వెళ్ళడానికి పడవ మీదా ప్రయాణం ఉదయం అమ్మకు సాయం చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని బయలుదేరి వెళ్ళిదే తనతోటి చదువున్న స్నేహితులు కొత్తగా కళాశాల జాయిన్ వారు వున్నారు. అందరు కలిసి కళాశాల విద్యార్థులు ఒక పడవలో వెళ్ళివారు…
అలా రెండు సంవత్సరాలు ఎవ్వరిని పట్టించుకోకుండా వుండే అభినయ మూడవ సంవత్సరంలో తన స్నేహితురాళ్ళు ఆటపట్టిస్తూ వుండేవారు నిన్ను చూస్తున్నారు చూడావే, చెప్పితే పట్టించుకోకుండా ఉన్నావు నీవు, అభిషేక్  అతని పేరు అందరూ అభి అనే పిలిచేవారు నిన్ను మాత్రమే చూస్తున్నాడు. అభికి మేము ఎవ్వరూ కనిపించడం లేదు  అసలు, మాకేసి చూడడం  తెలియదు మేము అందంగా లేదా ఏమిటి? వెంటనే అభినయ, సరే అయితే నన్ను ఏమి చేయమంటారు వే చెప్పాండి. నీవు కూడ రెస్పాన్స్ ఇవ్వు పాపం అబ్బాయి మంచివాడు  బుద్ధిమంతుడు తన పని తనదే అటువంటి అబ్బాయి నిన్ను చూస్తువుంటే నీవ్వు పట్టించుకోకుండా వుండడం మాకు భాదగా వుంది.
మా నాన్నగారి సంగతి తెలుసుకదా మీకు, నా తరువాత ఇద్దరు ఒక చెల్లి, తమ్ముడు వారి గురించి ఆలోచించి వద్దా దానికి  దీనికి సంబంధం ఏమిటి
వుంది ప్రేమ అనేది లోతు అయిన దానిలో మునిగేతి పాతుకుపోయే ప్రమాదం వుంది. ఇది నా విషయంలో జరిగే పని కాదు అనే చెప్పిన అభినయ మరునాడు అభిషేక్ కోసం చూసింది తను రాలేదు  చిట్టచివరగా పడవ ఎక్కిన అభిని అభినయ చూసింది అభి కళ్ళు అభినయ కళ్ళు కలుసుకున్నాయి. కాలం ఎవరి కోసం ఆగాదు కదా? మరి ముందుకు పోతుంది అలా. అభినయ కళ్ళు అభి కళ్ళుతో కబుర్లు చెపుతున్నాయి.  అప్పడప్పడు ఒకరంటే ఒకరికి ఇష్టం తెలుస్తోంది ఆ కళ్ళల్లో, బాధ తెలుస్తోంది. పలకరింపులు లేకుండా మౌనంగా వున్న ఎవరు పనిలో వారు ఉన్న మనస్సులు కలిసి ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాయి. మరి రెండు మనస్సులు కలిసింది, మరి వారు జంటగా మూడుముళ్ళ బంధంతో కొంగుముడితో  ఏడు అడుగులు కలిసి నడుస్తారా? అనేది మరి కాలం నిర్ణయం చేయాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!