చైతన్య సంద్రం

చైతన్య సంద్రం

రచన: వనపర్తి గంగాధర్

నిశ్శబ్దం నిజంగా ఓ శిక్ష
మాటలకు చెల్లు చీటి నిశ్శబ్దం
భయంకరమైనది నిశ్శబ్దం
గుండె గొంతుకల మధ్య
చెలరేగిన అంతుపట్టని వ్యధ నిశ్శబ్దం

నిశ్శబ్దం లేకుండా శబ్దానికి విలువెక్కడిది
మనుషుల మధ్య కరువైన బంధాలే
మాటలు రాని మౌన వేధన
అసమానతల వైరుధ్యభావనే నిశ్శబ్దం

మనసు దారితప్పిన ఆలోచనల
సంద్రంలో తల్లడిల్లుతున్నపుడు
నిశ్శబ్దమే సరియైన ఔషధం
రెండు ప్రేమ హృదయాలు
నిశ్శబ్ధాన్ని చేదిస్తేనే కదా
ఆనంద డోలికల మాలలు

మౌనవ్రతం ఓ మధురభావన
మౌనం ఓ గాయపడిన వేదనా మంత్రం
సజీవ చైతన్యానికి మూలం నిశ్శబ్దమే
నిర్జీవన బతుకు సారం నిశ్శబ్దమే
సమన్వయం మన చేతుల్లోనే,చేతల్లోనే ఉంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!