ఏం మొగుడండీ బాబు

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

ఏం మొగుడండీ బాబు..

రచయిత :: సరిత రవిప్రకాష్

కొంటె మొగుడు చెబితే వినడు .కొడితే ఏడుస్తాడు, అన్నట్టు అబ్బాబ్బా నా అగచాట్లు ఏమని చెప్పను ఎన్నని చెప్పను….

ప్రతిదీ సాగదీస్తారు వయసైతే అంతేనేమో మరి అమ్మో వయసయింది మీకు చాదస్తం అంటే అబ్బా అవును మరి నీకే కానిది అంటారు….

ఎన్నని చెప్పను పిల్లలకు ఏదైనా హిత బోధ చేస్తే గంటల కొద్దీ ల్యాగ్ చేసి మరీ చెబుతారు….

ఇంట్లో ఉంటే విసుగు
బయటికి వెళితే భయం ఎలా వేగేది ఈ చాదస్తపు మొగుడితో..

ఎక్కడ ఉన్నది అక్కడే ఉండాలి అంటాడు నేను చెప్పిందే వేదం అంటాడు పిల్లలకు విసుగు నాకు చిరాకు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నని చెప్పాను నా చాదస్తపు మొగుడి గురించి ఇన్ని ఉన్నా సర్దుకుపోవడం కూడా ఉందండి నా చాదస్తపు మొగుడికి…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!