ఇంటికి వెలుగు చదువు

ఇంటికి వెలుగు చదువు

రచన: పరాంకుశం రఘు

*మాస్టారు*:”ఏరా! బాబూ! నీ పేరేమి? నీది చదువుకునే వయసు కదా! ఇలా గొర్రెకాపరిగా మారావేమి?”
మాస్టారు గౌరీశంకర్ ప్రసాద్ అలా రోడ్డు వెంట వెళ్తూ, ఆ గొర్రెల కాపరిని ప్రశ్నించాడు?
*గోపి :*”నా పేరు గోపి అండి! మా నాన్ననే నాకు సరిగా చదువు అబ్బటం లేదని వారు వీరు చెప్పిన మాటలు విని ఇదిగో! ఇలా ఈ పనిలో కుదిర్చాడు. నాకు చదువoటే ఇష్టమే, మరి!”
*మాస్టారు:*”అవునా! అయితే మీ నాన్న పేరేమి? మీ ఇళ్లు ఎక్కడ? నాకు సరిగా ఆనవాళ్లు చెప్పగలవా!”
*గోపి :*”మన గ్రామం లోని బొడ్రాయి పక్కన ఎడమ చెయ్యి సందులోకి వస్తే నాలుగో ఇల్లేనండి! గొర్ల కాపరి మల్లయ్య అని ఎవరిని అడిగినా! చెబుతారు మాస్టారు.”
*మాస్టారు:* “అలా అయితే నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడి చదువుకొనే ఏర్పాటు చేస్తానులే”. “కానీ ఒక్క షరతు మల్లీ నీవు బుద్దిగా చదువుకొని అందరి పేరు నిలబెట్టాలి. సరేనా!”
*గోపి*: “అలాగే సార్!”
టoచనుగా మాస్టారు సాయంకాలం వేళ వారిoటికి వెళ్తాడు.
మల్లయ్య మాస్టారును గమనించడం. మన ఇంటికి మాస్టారు ఏదో పని మీద వచ్చాడని గ్రహించడం, వెనువెంటనే మాష్టారును ఆహ్వానించి కూర్చోమన్నాడు.
కొద్దిసేపు ఆ మాట ఈ మాట మాట్లాడిన మాస్టారు అసలు విషయానికి వస్తాడు.
*మాస్టారు:* “ఏమి! మీ అబ్బాయిని అలా చదువు మధ్యలో మాన్పిoచి
ఇలా గొర్రెల కాపరిగా! మార్చావు? చదివించటం నీకు ఇష్టం లేదా!”.
*మల్లయ్య :*”అది కాదు మాస్టారూ! వాళ్ళు వీళ్ళు అంటుంటే విని ,మా వాడికి నిజంగా చదువు బాగా అబ్బటం లేదని చదువు మాన్పించాను.అంతేకానీ నాకు చదువoటే, వల్లమాలిన ప్రేమ మాస్టారూ!రెంటికి చెడిన రేవడి కావొద్దు అనేదే నా లక్ష్యం.”
*మాస్టారు:*”అందరూ పుట్టుకతోనే జ్ఞానవంతులు కారయ్యా! కొoదరేమో అలా చదువుకు హత్తుకు పోతారు ! మరికొందరిలో మరి కొంత సమయం పడుతుంది!. ఎన్నో ఉలి దెబ్బలు తింటేనే కదా! శిల శిల్పంగా మారేది!. ప్రయత్నిస్తే మీ వాడు కూడా రేపో మాపో మంచి చదువరి కాకపోడులే!
ఇక నుండి చిన్న చిన్న విషయాలతో రాజీపడక ఏదేమైనా నీ కుమారున్ని మళ్లీ బడికి పంపించు! చదువుతోనే జీవన సాఫల్యం. చదువే మనిషికి సంపూర్ణ సార్ధకత. ఇంటికి అసలైన దీపం మరియు వెలుగు చదువే. అలా సముదాయించాడు మాస్టారు.”
*మల్లయ్య* :”సరేనండి! మీరు వచ్చి నా బాధ్యతను గుర్తించి మరీ చెప్పారు కదా! ఇక ఈ జన్మలో మా అబ్బాయిని చదువు మాన్పిoచను”
అలా గౌరి శంకర్ ప్రసాద్ చదువుకు దూరమైన బాబును చదువులో కొనసాగేలా చేశాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!