అనుభవ పిపాసి

అనుభవ పిపాసి

రచన: చిరునవ్వు rj రాల్స్

అనుభవం అంతకన్నా పెద్దది దానిని కొన్ని కోట్లుపెట్టిన కొనలేను అంటున్న ఒక చిన్న 14సంవత్సరాల పిల్లోడి మాటలు నాకు ఆశ్ఛర్యాన్ని కలిగించాయి.
ఆ పిల్లోడితో మాట్లాడిన ప్రతీ క్షణం నన్ను నేను అసహ్యించుకున్న. నాకెందుకు అంతటి గొప్ప సత్యాన్ని గ్రహించే జ్ఞానం రాలేదని.

ఆ పిల్లోడితో నా ప్రయాణం : ఉదయాన్నే లేచి ఊరెళదామని రైల్వే స్టేషన్ కొచ్చ అప్పుడు సమయం ప్రొద్దున 4:30 అయింది.

స్టేషన్ లోపలికెళ్ళి టికెట్ తీసుకోని ప్లాట్ఫామ్ లొ చివరకెళ్లి ఓ టేబుల్ పైన కూర్చున్న. కూర్చున్న కొద్దిసేపటికి టేబుల్ వెనకనుండి ఎవరో చిన్నగా మూలుగుతున్న శబ్దం వెళ్లి చూస్తే చిన్నపిల్లోడు…..అతుకులతో కుట్టి రంధ్రాలు పడ్డ ఒక దుప్పటి కప్పుకొని చలిని తాళలేక మూలుగుతున్నాడు.

ఆ పిల్లోడితో అప్పటి పరిచయం నా జీవిత మలుపు. నన్ను చూడగానే లేచి కూర్చున్నాడు.
నేను…ఎందుకు ఇక్కడ పడుకున్నావ్ అమ్మవాళ్ళులేరా ఆలా.. ఆరాతీసి అడిగాను.

నేను గమనిస్తూనే ఉన్న పిల్లోడి ముఖంలో ఎలాంటి భయందోళనలు లేవు. ఏదో చెప్పాలనుకుంటున్నాడు.
కానీ చలికి మాటలు రావట్లేదు. నాకేమి తోచక  స్టేషన్ సిబ్బంది దగ్గర టాబ్లెట్స్ తీసుకుని వచ్చి పిల్లోడికి వేయించా………..
కొద్దిసేపటికి మామూలయ్యాడు.

పిల్లోడి మొదటి పలుకు:మీకు మీ ఆదరణకు కృతజ్ఞతలు ఎన్నో రోజుల నా ఈ స్టేషన్ బతుకులో మొదట పలకరించింది మిరే అని గొప్పగా మాట్లాడ్తున్నాడు ఎన్నాల్లో అనుభవం ఉన్న ముసలాడిలా….
ఎన్ని రోజులగా ఉంటున్నావ్ ఈ స్టేషన్ లొ…? నాదేముంది సార్ కొన్ని రోజుల్లో పోయే ప్రాణం
నా తల్లిదండ్రులే నన్ను కాటేసారు.
అయినా అది నా మంచికే జరిగింది.

ఆ పిల్లోడి ఒక్కోమాట నన్ను మేల్కొల్పుతున్నాయ్ ఒక ఋషి మల్లి పుట్టాడా అన్నట్టున్నాయి ఆ..మాటలు.

నేను చిన్నప్పటి నుండి బాగానే ఉన్నాను సార్ కానీ మధ్యలో వచ్చింది అందర్ని నాకు కాకుండా చేసింది.
నాకు 2సంవత్సరాలుగా క్యాన్సర్
ఒక్కపూట  తిండి కోసం బడికి వెళ్ళేవాణ్ణి

నా తల్లి స్టేషన్ లో ప్లాస్టిక్ బాటిల్స్ వేరుతువుంటుంది.
నా తండ్రి మధ్యపానానికి బానిసై స్టేషన్ లో అందరి దగ్గర చిల్లర అడుక్కుంటు ఉంటాడు.
నాతోటి పిల్లలతో చాలా ఆనందంగా గడిపే వాడిని అల్లరి ఆటపాటలు ఎన్నో….. బడికి తిండికోసం వెళ్లి
వాళ్ళు చెప్పే పాఠాలు విని వచ్చి ఇంట్లో అమ్మకు,
మా మురికి వాడ స్నేహితులతో చెప్పేవన్నీ.

ఈ రోజు ఇలా ఈ స్టేషన్ లో పడుకోడానికి ఒక చిన్న కారణం అది నా తల్లిదండ్రికి నేను బరువుకావడమే.
ఆలా నేను బరువు కావడానికి కారణం
నా బడి చదువే……

నిజానికి మా అమ్మగారు స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా ఉండాలిసింది. కానీ ఆ….. ఉద్యోగానికి తగ్గ లంచాలు ఇవ్వలేక ఇలా ప్లాస్టిక్ వేరుతూ సాగిస్తుంది.
నాకేం అర్ధం కాలేదు….. మీ అమ్మగారు చదువుకున్నారా..? అవును మా… అమ్మ ఒక పెద్ధింటి అమ్మాయి తల్లిదండ్రులను వదిలి మా నాన్నగారితో వచ్చేసింది.

ప్రేమ వివాహం వాళ్ళది.
మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు ఒకే కాలేజీ లో గ్రాడ్యుయేట్ చేసారు.
మా నాన్నగారు గొప్ప స్పోర్ట్స్ వ్యక్తి  (జావీలింగ్ త్రో )అప్పట్లోనే ప్రేమ,ఇంట్లో చిన్నచూపు ఆ కారణాలతో మా వీధిలోనే పెళ్లిచేసుకున్నారు.
పెళ్లి కారణంతో మా నాన్న గారు స్పోర్ట్స్ కి దూరమయ్యారు.అమ్మని మాత్రమే చదివించారు.
కానీ అదృష్టం ఆమడ దూరంలో ఆగిపోయింది డబ్బు లేక.
నేను వింటూనే ఉన్న ఎప్పుడు జరిగే కథలే అని అనుకుంటూ ఉండిపోయా అడగొద్ధు అనుకుంటూనే అడిగాను.
వారి ప్రేమకి రూపానివి కదా…తల్లిదండ్రులు నిన్ను కాటేయాడమెంటి వాళ్ళకి నీవు బరువు కావడానికి బడి చదువు ఎందుకు కారణం అని అడిగాను.

హ అవును నేను పుట్టకముందే నన్ను గొప్పగా తీర్చిదిద్ధాలని అందరి తల్లిదండ్రుల్లా  కలలుకన్నారు.  అందుకోసం నన్ను మా వీధి పిల్లలతో కాకుండా కొన్వెంట్ బడిలో చదివిస్తున్నారు.
నాన్నకి నా ఫీజులు,ఇల్లు గడపడం కష్టంగా ఉందని అమ్మ జాబ్ చేయడానికి నిర్ణయించుకుంది.

మా విధిలో అమ్మలా చదువుకున్నవాళ్లు లేరు.
జాబ్ కెళ్ళిన కొన్ని రోజుల్లోనే మానేసింది.
బయటి వ్యక్తుల అల్లర్లు వల్ల అదేనండి మా మురికి వాడకిచ్చే మర్యాద అది.
నాకొద్దిగా బాధేస్తున్న వింటూనే ఉన్న.
ఇక ఫీజుల కట్టలేక భోజనం కూడా పెట్టలేని స్థితిలో నన్ను మాములు బడిలో వేసారు.
అక్కడంత బాగానే ఉంది మా వీధి పిల్లలతో, మధ్యాహ్న భోజనంతో అంతా బాగానే ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు ఒక్కపూటకే పరిమితమయ్యారు.
నేను కూడా చిన్న చితక పనిచేయాలని నిర్ణయించుకున్న.

ఇంట్లోవాళ్ళకి తెలియకుండానే ఉదయాన్నే లేచి ఆడుకోడానికని చెప్పి మా విధికి దగ్గర్లో ఉన్న షాప్స్ కి ముందు వాకిలి ఊడ్చి వాళ్ళిచ్చేడబ్బుని కూడపెడ్తున్న.

ఆలా నా ప్రయాణం బాగానే ఉంది కానీ ఆ….సంతోషం కొన్ని రోజులె అని ఊహించలేదు అని చెప్తూనే ఆపేసి కన్నీళ్లు కారుస్తున్నాడు.
నేను అస్సలు చూడలేకపోయి సరేలే వొదిలెయ్ మనమేదైనా వేడిగా టిఫిన్ చేసిద్దాం అని స్టేషన్ బయటకి తీసుకెళ్లను.
టిఫిన్ చేసి తిరిగి స్టేషన్ కొచ్చి కూర్చున్నాం.
మల్లి నాకు తెలుసుకోవాలనిపించి అడిగాను నికు క్యాన్సర్ అన్నావుగా అని హ అవును మా నాన్నగారు పోర్ట్ ఏరియాలో  జాలర్లతో పాటు వెళ్లి వేటసాగిస్తుంటారు. అనుకోకుండా చేపల వేటకి వాడే పద్దునైనా గాలేం కంటికి గుచ్చుకుని చూపు పోయింది.
అక్కడి పెద్దయాన పనిలోనుండి తీసేసారు.
దానికి తోడు ఇల్లు గడవట్లే అనే బాధతో తాగుడికి బానిసయ్యడు అంతే బాధ్యత అమ్మపై పడింది.

నేను చేస్తున్న ఈ పనిని అమ్మకి చెప్పి అలానే కొనసాగించాను.
అమ్మ కూడా నాతో పాటు వాకిలి ఊడవడం ఇళ్లల్లో పాత్రలు కడగడానికేళ్ళేది.
నాకు కొద్దిగా చదువు సన్నగిళ్ళింది.
చదరంగం పోటీల్లు నేను బానే పోటీపడేవాణ్ణి అమ్మకి అవన్నీ నా ఫ్రెండ్స్, టీచర్స్ చెప్పేసరికి ఎలాగైనా నన్ను ఆ రంగంలో రానించేలా చేయాలనీ నన్ను పని మానించేసి ఒక చదరంగపు ట్రయినింగ్ ఇచ్చే మాష్టారు దగ్గర నన్ను చేర్పించింది.
కొన్ని రోజుల్లోనే నేను డిస్ట్రిక్ట్ లో top కొట్టాను.
మా కలెక్టర్ గారి చేతులమీదుగా శీల్డ్ కూడా తీసుకున్నాను.
స్టేట్ లేవల్ లో ఆడడానికి కలెక్టర్ గారు సహాయన్ని కూడా అందిస్తామని ప్రకటించారు.

ఇక మా వీధి ని వదిలి స్పోర్ట్స్ అకాడమీ లోకెళ్ళాను. అక్కడంత ఏమి బాలేదు నాకు మా మురికి వాడనే నాయమనిపించింది.
ఎలాంటి సదుపాయలు లేవు.అయినా అవన్నీ వొదిలేసి చదరంగం పైనే మనసు పెట్టాను.
అక్కడున్నవాళ్లలో నాదే చిన్న వయసు.
అందరూ మెచ్చుకునేవాళ్ళు ఒకరోజు మా అమ్మగారినుండి ఫోనోచ్చింది.

చాలా సంతోషంతో వెళ్లి ఫోనెత్తను అమ్మకి మాటలు రావట్లేవు నాకు బయమేసింది.
ఏమైందమ్మ అని అనగానే ఏడ్చేస్తు మీ నాన్న గారు వారం రోజులుగా కనబడట్లేరు నాకేం కాళ్ళుచేతులు ఆడట్లేవు అని ఏడుస్తూనే ఉంది.

ఈ అకాడమీ లో నేను వెళ్లాలని పరిమిషన్ అడిగిన ప్రయోజనం లేదు ఎలాగోలా గోడలు దుకొచ్చేసా. ఇంట్లోకెళ్ళాను అమ్మ లేదు వెరెవరో మా ఇంట్లో ఉన్నారు. పక్కనవాళ్ళకి అడిగాను స్టేషన్ లో ఉందన్నారు.
వెళ్లి చూసాను యే ప్లాట్ఫామ్ మీద కూడా కనబడట్లేదు.

చాలా దూరంలో హేయ్ ఎవరమ్మానువ్ పక్కకు జరుగు ట్రైన్ వస్తుంది అని అరుస్తూ తోస్తున్నారు.
ఎవరా అని చూస్తే మా అమ్మే ప్లాస్టిక్ బాటిల్స్ వేరుతూ పట్టాలపై ఎలాంటి ఓపిక లేకుండా నీరసంగా ఉంది.
చూసి తట్టుకోలేకపోయాను.
పట్టలాపైనుండి ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. నన్ను చూడగానే ఒకటే ఏడుపు
ఏమైందమ్మా ఏంటిలా అని అడిగాను మీ నాన్నగారు తాగుడికి బానిసయ్యి అ పోర్ట్ పెద్దయాన దగ్గర డబ్బులు తీస్కుని కట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయారు.
ఆ పెద్దయానని ఎంత వేడుకున్న మన ఇల్లుని వదలకుండా లాగెసుకున్నారు. నాకిక అక్కడ చోటులేక ఎవ్వరింట్లో ఎక్కువరోజులు ఉండలేక  స్టేషన్లో ఇలా అని చెప్పుతూ నన్ను పట్టుకు ఏడ్చేసింది.

ఆ రోజు నుండి ఈ స్టేషనే మాకు ఇళ్లయింది.
అయినా ఇవన్నీ  చెబుతూ మిమ్మల్ని బాధపెడుతున్నానేంటో అని పిల్లోడు అంటున్న లోపే
నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసింది.
ట్రైన్ లో రష్ చాలా ఉంది ఎక్కడానికి దిగడానికి కూడా రానంత రష్ గా ఉంది. నాకేమో ఈ పిల్లోన్ని వదిలి పోవాలనిపించట్లేదు.
చాలా ప్యాసింజెర్స్ దిగుతున్నారు.నేను కొద్దిసేపు ఆ పిల్లోడి పక్కనే నిల్చుండిపోయా.
ఆ ట్రైన్ నుండి దిగిన ఒక వ్యక్తి పెద్ద కళ్లద్ధాలు చూడ్డానికి బాగా పెద్దవయసు,సూటు వేస్కుని  పిల్లోడి తల్లికి ఏదో.. అడ్రెస్స్ అడుగుతూ వణుకుతున్న చేతితో అడ్రస్ చీటిని చూయిస్తున్నాడు.
ఆ అడ్రస్ ఆ పిల్లోడి తల్లిదే అంటే ఆవిడే ఆ…పెద్దయాన కూతురు.
ఆవిడా వాళ్ళ నాన్నగారిని గుర్తుపట్టిన కూడా స్టేషన్ పక్క వీధి ఆ…. మురికివాడే అని చెప్పి పంపించేసి మళ్ళీ ఈ పిల్లోన్ని పిలిచి ఏడుస్తుంది.
నా ట్రైన్ కదిలింది ఎక్కడానికి వాళ్ళని చూస్తూనే పరిగెడ్తున్న అంతలో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది.
వెంటనే పరిగెడతూ ఆవిడని ఆ స్టేషన్ ప్రథమ చికిత్స రూంకి తీసుకెళ్లి అక్కడి నర్స్ కీ అప్పజెప్పాను.
పిల్లోడు నేను బయట కూర్చున్నాం.
మల్లి పిల్లోడిని  అడిగాను నీకు క్యాన్సర్ అని మీ అమ్మగారికి తెలుసా ఆమె ఎందుకలా పడిపోయింది ఏమైంది అని ఇదివరకే ఒకాయన అడ్రెస్ అడిగాడని అతనే మా తాతగారని చెప్పి పడిపోయిందని హ క్యాన్సర్ అని తెలీదు. స్పోర్ట్స్ అకాడమిలో ఎంట్రీ అయ్యేముందు నా హెల్త్ చెకప్ లో క్యాన్సర్ అని తెల్చారు.
దానికి తగ్గ చికిత్స నమమాత్రంగా  ఇస్తున్నారక్కడ.
ఊరోచ్చాక అమ్మకి చెప్పాలనుకున్నా…కానీ ఇవ్వన్ని చూసి ఎలా చెప్పగలను స్పోర్ట్స్ కీ దూరమైన తండ్రి ,
జాబ్ సంపాదించలేని తల్లీ, చదువునే కొనసాగించలేని నేను
ఒకరి చదువుకోసం ఒకరు శ్రమించి వృధాగా మిగిలిన జీవితాలకి మా సదువులే కారణమాయ్యాయేమో..!!!

జీవితం సాఫిగ సాగిపోతుందేమో అనుకుని ఏమి ఆలోచించకుండా ప్రేమవివాహం చేసుకున్న నా తల్లిదండ్రులు నా జీవితాన్నే కాటేసారేమో..!!!
మందుకి బానిసయిన భర్త కీ భార్యగా,
ఎలాంటి జవాబు చెప్పుకోలేని తండ్రికి కూతురిగా మిగిలిపోయిన నా తల్లికి ఇంకా భారమవ్వద్దనే ఇలా..
నా జీవితం సాగిపోతుంది అంటూ చెప్తున్నా ఆ పిల్లోడి మాటల్లో చాలా అనుభవం కనబడింది.
అవన్నీ విన్న నేను చలించిపోయా.. ఆ పిల్లోడికి నా వంతుగా తను మరిచిపోలేని సహాయాన్ని అందించాలని బాధగానే పిల్లోడికి టాటా…చెప్తూ.. నా తదుపరి ట్రైన్ ఎక్కేసాను.

గమనిక : నిజ సంఘటనల్లా అనిపించే ఈ కథ పూర్తి కల్పితమే…. కొంత మార్పు కొరకే 🙏
మిత్రమా చిరిగిన చొక్కాలు, ప్లాస్టిక్ బాటిల్లు,ఇల్లుగా మారిన  రైల్వే స్టేషన్లు మాత్రమే కాకుండా సమాజంలో ఊహించని విచిత్ర గాధలెన్నో ఉన్నాయ్.
ఎవరి ప్రత్యేకత వాళ్ళది.చిన్నచూపు పనికిరాదు ఆ దుస్థితి మనకింకా రాలేదు.
చిన్న చిన్న సమస్యలకే సతమతమయ్యే మనం చిన్నప్పుడే అనంత కష్టాన్ని చూసిన ఈ పిల్లోడు చేరవలసిన గమ్యస్థానం చితికే. ఆ రోజుని ముందే రప్పించుకుంటే పిరికిగా మిగిలిపోతావ్.
ని చితి మంటలు నిన్ను చూసి వెక్కిరిస్తుంటే ని ఆత్మ కూడా సిగ్గుపడుతుందేమో…!!!!
మనం బ్రతికున్న కొన్ని క్షణాలు మనకోసమే అని స్వార్ధంగా కాకుండా
నీ  జీవితానికి ఈ మంచి పని నువ్వే చేసావ్  అని పదిమందిలో గుర్తుండిపోయేలా బ్రతికి చూపిద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!