మౌనసాక్షి

(అంశం : మనసులు దాటని ప్రేమ)

మౌనసాక్షి

రచయిత :: యం.సుశీలారమేష్ 

నమస్కారం! నా పేరు డాక్టర్ రాజా.నేను గాంధీ హాస్పిటల్ లో వర్క్ చేస్తాను. నేను చెప్పబోతున్న కధ కరోనా మహమ్మారి వలన ఎన్నో కుటుంబాలు అస్తవ్యస్తంగా మారాయి..

ఎప్పుడూ ఇంట్లో ఉండని వారు ఇంట్లో ఉంటే, ఇళ్ళల్లో ఉండే వారు బయటకు గెంటివేయబడ్డారు. ఎంతోమంది తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. కొంతమంది తమ అ కన్నబిడ్డలను పోగొట్టుకున్నారు. భర్తలను పోగొట్టుకున్నారు భార్యలు. భార్యలను పోగొట్టుకున్నారు భర్తలు.

కరోనా మహమ్మారి వలన ప్రపంచమంతా హా హా కారాలు చేసిందంటే ఇది ఎవరి తప్పిదం మనది కాదా మనం నిర్లక్ష్యం కాదా? తప్పు ఎవరిదైనా కోట్ల జీవితాలను మాత్రం ఛిద్రం చేసింది కరోనా.

తీవ్రమైన భయాందోళనల మధ్య ఎన్ 95 మాస్కులు పి పి ఈ కిట్ ధరించి రోగి చెంతకు వెళ్లే వాళ్లం.

ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పిపిఈ కిట్ వేసుకుంటే వార్డులన్నీ తిరగడానికి మూడు నాలుగు గంటలు పట్టేది.

అదే మండుటెండలో అయితే చెమటకు తడిచి ముద్ద అయ్యేవాళ్ళం, తల నుంచి చెమట కళ్ళలోకి కారుతున్న తుడుచుకునే వీలు లేని పరిస్థితి మాది.

అయినా సరే రోగుల అందరిని పలకరించే వాణ్ని, నా రోగులంతా ఎదురు చూడడం నాకు సంతృప్తినిచ్చిన విషయం.

డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ వచ్చి నాతో ఫోటో దిగి వెళ్ళినవారు ఉన్నారు. కోలుకున్న వారిని వారి ఇంటి సభ్యులు ఇంటికి తీసుకువెళ్లడానికి నిరాకరించే వారు.

ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం లో పెద్దావిడ కు 98 సంవత్సరాలు. కరోనా సోకింది. ఆవిడ కోలుకున్న తర్వాత వారి ఇంటి సభ్యులు నిరాకరిస్తే పోలీసులు జోక్యంతో తీసుకెళ్లారు ఇంటికి కాదు వృద్ధాశ్రమానికి.

ఒకటి కాదు రెండు కాదు కరోనాను జయించినా ,పాషాణ హృదయాలను గెలవ లేకపోయినా వృద్ధులు ఎందరో ఉన్నారు .చికిత్స చేసేటప్పుడు వృద్ధులు బాత్రూంకి వెళ్లి అక్కడే సొమ్మసిల్లి పడిపోయే వారు. అలాంటివారికి డైపర్స్ వేయడం మార్చడం అన్ని మేము మా సిబ్బంది చేసేవాళ్ళం. నేను మాత్రం రోగి దగ్గరకు వెళ్లి ముట్టుకునే వైద్యం చేశాను అలా చేయకపోతే నా వృత్తికి అర్థం లేదు.

365 రోజులలో ఒక్క రోజు కూడా నేను సెలవు పెట్టలేదు. కరోనా బాధితుల్లో కొందరు తమ జీవితాల్లో చేసిన పొరపాట్లు తలుచుకుంటూ బాధపడేవారు.

ఒక వ్యక్తి (55 ఏళ్లు) నేను నా తమ్ముడికి ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశాను అని నా చేయి పట్టుకుని కుమిలిపోయే వాడు. ఒకసారి తన తమ్ముడి తో మాట్లాడించమని కోరాడు. అతని ఫోన్ నెంబర్ కోసం ప్రయత్నించినా లభించలేదు. మూడో రోజున రోగి మృతి చెందాడు. తన కోరిక తీర్చలేక పోయానే అని ఇప్పటికీ ఆ బాధ నా మదిని దాటిపోలేదు. గుర్తొచ్చినప్పుడల్లా వేదిస్తూ ఉంటుంది.

కరోనా బాధితులు వారి కుటుంబ సభ్యులతో ఇదే ఆఖరి రోజు అన్నట్లుగా మాట్లాడేవారు. ఇలాంటి అనేక భావోద్వేగాలను ప్రత్యక్షంగా చూశాను. కోలుకొని ఇళ్లకు వెళ్లే వారి కళ్ళలో కనిపించే మెరుపు మాకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చేది.

హైదరాబాద్ కు చెందిన ఒక టైలర్ ఇలాగే కోలుకుని ఇంటికి వెళ్లి నా కోసం 5 జతల దుస్తులు కుట్టి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు.

 ఇలాంటి ప్రేమలు ఆప్యాయతలు ఎన్నో ఎన్నెన్నో అందుకే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకున్నాను.

మేము మా సిబ్బంది మొత్తం కలసికట్టుగా సేవలందించడంలో ఎలాంటి తారతమ్యం లేదు.

సరే జనాః సుఖినోభవంతు అంటారు కదా! నేను మాత్రం మాస్క్ ధరించిన జనాః సుఖినోభవంతు అంటాను. మరి మీరేమంటారు.

కరోనా వలన మనసు కలచివేసే సంఘటనలను తలచుకుంటే ఇప్పటికే నేను మౌన సాక్షిగా మిగిలిపోయాను. కానీ ఒక విషయం నన్ను బాగా కలిచి వేసేది, ఏంటంటే కన్నతల్లిని కూడా కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లాలేని ఆ తల్లి సంతానం యొక్క మనసు దాటని వారి ప్రేమను తలచుకుంటే నా మది కాకా వికలం అవుతుంది.

ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వీడి స్వీయ రక్షణ పాటించండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!