కనులు తెలిపిన ప్రేమ

(అంశం : మది దాటని ప్రేమ)

కనులు తెలిపిన ప్రేమ

రచయిత: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి శ్రీ 💜శ్రీ

ఆరోజు మధు కి పెళ్లిచూపులు. అమ్మాయిని చూడ్డానికి మధు వాళ్ల డాడీ వెంకట్రావు, మమ్మీ సత్యవతి ఇంకా ఐదుగురో ఆరుగురో కుటుంబసభ్యులు వెళ్తున్నారు. అంత తక్కువ మందే వెళ్లడానికి గల కారణం మధు వాళ్ల డాడీ పెళ్లిచూపులకే ఎక్కువమంది వెళ్లి కుదరకపోతే వాళ్లని బాధపెట్టి మనం బాధపడడం తప్పితే ఇంకేమి ఉండదు అబ్బాయికి , అమ్మాయికి నచ్చితే ఎలాగూ నిశ్చితార్థం పెట్టుకుంటాం కాబట్టి దానికి అందరినీ తీసుకుని వెళితే అందంగా ఉంటుంది అనడం మూలాన కొద్దిమందే వెళ్లడానికి సిద్ధపడ్డారు.అబ్బబ్బా టైమ్ పదకొండు కావస్తోంది వదిన, ఇందిర ఇంకా రాలేదు మధు నువ్వెళ్లి వాళ్ళిద్దర్నీ తొందరగా పిలుచుకురా అంటూ మధుకి ఆర్డర్ వేసింది సత్యవతి సరేనంటూ ఇందిర వాళ్ళింటికి వెళ్లి అత్తయ్యా,అత్తయ్యా అంటూ పిలిచాడు మధు ఇంటిలో నుండి సుభద్ర బయటకు వచ్చి రా మధు పైకి రా అంది పైకి రావడం కాదు అత్తయ్యా మనం ఈరోజు అమ్మాయిని చూడ్డానికి వెళ్లాలి కదా మీరు ఇంకా రాలేదని అమ్మ కంగారుపడుతూ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపింది అన్నాడు మధు..ఆ మాటకి సుభద్ర భర్త లేనిదాన్ని నేనెందుకులే బాబు ఇందిర వస్తుంది తీసుకెళ్లు అంది ఇందిరా ఇందిరా అంటూ లోపలికి వెళ్లిన మధు ఇందిర ఇంకా రెడీ అవ్వకపోవడాన్ని చూసి అదేంటి నువ్వింకా రెడీ అవ్వలేదు ఒకప్రక్క టైమైపోయిందని అమ్మ కంగారు పడుతుంటేనూ అన్నాడు .ఆ మాటలకి ఇందిర నీరసంగా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బాన నేను రాలేను ఏమీ అనుకోపద్దు మీరెల్లండి అంది . నాకు పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు మధు . ఛ ఛ అదేం లేదు బావ నిజంగానే తలనొప్పిగా ఉంది నాకు బాగుంటే వచ్చేదాన్ని అంది ఇందిర ఇంక చేసేదేమీ లేక ఇంటి దారి పట్టాడు మధు.

మా డాడీ సుభద్రత్త అన్నాచెల్లెళ్లు .మావయ్య సుందరయ్యది కూడా ఈ ఊరే కావడంతో వాళ్లు మేము కూడా ఒకే ఊరిలోనే ఉంటున్నాం మా అమ్మానాన్నలకు నేనొక్కడినే సంతానం అలాగే అత్తయ్య, మావయ్య లకు కూడా ఇందిర ఒక్కతే కూతురు .ఇందిర చాలా చలాకీగా ఉంటూ మాటిమాటికీ నన్ను ఆటపట్టిస్తూ దానికి నేను ఉడుక్కుంటుంటే గల గలా నవ్వుతూ ఉండేది. ఆడుకుంటున్న మమ్మల్నిద్దరినీ చూసి వీళ్లద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని మావయ్య, దానికి అత్తయ్య కూడా చేద్దామండి అని వారిద్దరూ అలా మాట్లాడుకోవడం నాలుగైదు సార్లు నా చెవిన పడింది అలాంటిది నేను బి టెక్ ,ఇందిర ఇంటర్ చదువుతుండగా మావయ్యకి సడన్ గా గుండెపోటు పచ్చి చనిపోయారు దానితో ఇంటర్ అయిపోయాక ఇందిర చదువు మానేసింది కౌలుకిచ్చిన పొలం డబ్బులు వస్తుంటే వాటితో అత్తయ్యా ఇందిర బ్రతుకుతున్నారు అత్తయ్యకి ఆత్మాభిమానం ఎక్కువ ఎవరియొద్దనుండి ఏదీ ఆశించదు ఇందిర కూడా అంతే.మావయ్య చనిపోయిన దగ్గర నుండి ఇందిరలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి ఆఖరికి నాతో కూడా సరదాగా ఉండడం మానేసింది ఇప్పటి ఇందిరను చూస్తుంటే అప్పటి ఇందిర తనేనా అని అనుమానం కూడా కలుగుతుంది బి టెక్ పూర్తయ్యాక నాకు జాబ్ వచ్చింది అమ్మ, నాన్న నాకు ఇందిరనిచ్చి పెళ్లి చెయ్యమని అత్తయ్యని అడుగుతామన్నారు దానికి నేను ఇందిర మనసులో ఏముందో మనకి తెలియదు నాకు సంబంధాలు చూడాలని చెప్పినప్పుడు కూడా ఇందిరని చేసుకో మని అత్తయ్య కూడా అడగలేదు నాకు ఇందిరంటే ఇష్టము గనుక ఇప్పుడు మనం అడిగితే డబ్బుంది మంచి స్థితిలో ఉన్నారు గనుక ఇంక మిగిలిన వారి ఇష్టాయిష్టాలుతో పని లేదా అనుకుంటారేమో లేకపోతే అడగినందుకు బలవంతంగా ఒప్పుకుంటారేమో వద్దమ్మా వాళ్లని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాను దానికి సరేరా నీ ఇష్టమే మా ఇష్టమంటూ బయట సంబంధం చూసారు.

అత్తయ్యా అత్తయ్యా అంటూ లోపలికి వచ్చిన మధు సుభద్రను చూసి అత్తయ్యా అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మాయికి నేను కూడా బాగా నచ్చేసానంట అన్న మధు మాటకి సుభద్ర అడ్డం వస్తూ నువ్వు బంగారం ఎందుకు నచ్చవు నిన్ను చేసుకునే అమ్మాయి, ఆ అమ్మాయి తల్లిదండ్రులూ కూడా ఎంతో అదృష్టవంతులు అయి ఉంటారు అంది. ఆ అమ్మాయి తరుపువాళ్లు నిశ్చితార్థం అవీ లేకుండా ఇంక ఏకంగా పెళ్లి పెట్టేయమన్నారు ఇదిగో అత్తయ్యా శుభలేఖ అని సుభద్ర చేతికి శుభలేఖ అందివ్వబోయాడు మధు దానికి సుభద్ర మంచిది బాబు నాచేతికెందుకు ఇందిరకివ్వు అన్నది ఆ మాటకి అక్కడే ఉండి ఇవన్నీ వింటున్న ఇందిర ముందుకు వచ్చి శుభలేఖ అందుకుని తెరచి చూసింది అంతే ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో ఇందిర కళ్లలో మెరుపు దానికి కారణం శుభలేఖలో మధు వెడ్స్ ఇందిర అని ఉండడమే .విషయం తెలిసిన సుభద్ర ఏంటి బాబు ఇది అంది ఆనందం ఆశ్చర్యం కలగలిసిన స్వరం తో. దానికి మధు ఈనాడు శుభలేఖ చూసి మెలరిసిపోయిన ఈ కళ్లే ఆనాడు నేను అమ్మాయిని చూడడానికి వెళుతున్నాము అని చెప్పినప్పుడు వర్షించాయి. కానీ నేను చూడలేదనుకున్నావు నువ్వు. నీ ” మనసు దాటని ప్రేమని ” నీ కనులు తెలిపాయి నాకు అన్నాడు మధు ఇందిర వంక చూస్తూ. పిచ్చి పిల్లా డబ్బు లేకపోతే చేనుకోకపోవడానికి మేము డబ్బు మనుష్యులమనుకున్నావా మిమ్మల్ని తీసుకురావడానికి వచ్చిన మధు ఇంటికి వచ్చి విషయమంతా చెప్పి పెళ్లిచూపులు కేన్సిల్ చేసేయ్యమన్నాడు అన్నది కొడుకు వెనకే వచ్చిన సత్యవతి. కళ్లలోనే నా మనసులోని ప్రేమని అర్థం చేసుకున్న బావ నాకు దొరికినందుకు నేను ఎంత అదృష్టవంతురాలిని అంటూ మధు కాళ్ళమీద పడింది తనను క్షమించమంటూ.నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ అంటూ ఇందిరని లేపి గుండెలకు హత్తుకున్నాడు మధు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!