మది దోచిన వాడు

(అంశం: “ఏడ తానున్నాడో”)

మది దోచిన వాడు

రచన: పరిమళ కళ్యాణ్

నల్లని వాడు, అల్లరి వాడు
వేణు గాన మాధుర్యంతో
గోపికల మదిని దోచిన వాడు
ఆతని ముగ్ధ మనోహరం సౌందర్యంతో
జగతిని సైతం మోహింప చేయువాడు
నెమలి పింఛముతో అలరాడు వాడు
కస్తూరి తిలకంతో కాంతులీనువాడు
గోవులను కాసేటి గోపాల బాలుడు
వేలుతో గోవర్ధన గిరినెత్తిన గోవిందుడు
ప్రేమమయుడు యశోదా తనయుడు
దేవకీనందనుడు నవనీత చోరుడు
ఆద్యంతరహితుడు అనంతుడు
రాసలీలలాడినట్టి రాధామాధవుడు

ఏడతానున్నాడో వాడు
నా మది దోచిన ప్రియసఖుడు
నా కన్నులలో నిండిన కమల నాధుడు..

You May Also Like

2 thoughts on “మది దోచిన వాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!