జీవన రవళి

జీవన రవళి

రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు ప్రకాశంతంగా మెరుస్తున్నాడు రమ్య.వంట పూర్తి చేసి ఇంట్లోనే కంప్యూటర్స్ వర్క్ మొదలు పెట్టింది ఆర్థికంగా కొంత అయిన సంపా దించాలని ఆశ .భర్త ఎన్నో రకాల బిజినెస్ లు
చేసి అలసి డబ్బు ఖర్చు చేశాడు ఉన్నది చాలు ఊళ్లు ఏ లక్కర లేదని అత్తగారు గోల పెట్టిధి అయితే వింటాడా పతి దేముడు ఆ నాడు ఆఫీసర్ ఉద్యోగం వస్త్ నన్ను పంపలేదు .ఇవ్వాళ బిజినెస్ చెయ్యి నివ్వరు.అంటూ సాధిస్తాడు
శాస్త్రి దత్తుడు ఆస్తి ఉందని పెద్దలు అంతా కలసి పెద్దమ్మ దత్తత చేసి మేన మామ కూతురు తల్లి లేని పిల్ల అంటూ చిన్నతనం లోనే పెళ్లి చేశారు. లంకంతా ఇల్లు అస్తి అన్ని ఆవిడ చేతిలో ఉంది
శాస్త్రి మేనమామ అంటే భయం వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు తలచుకుంటే గంటలో ఉద్యోగం వేయించి.ఆర్డర్ తెగలరు. అయితే అక్కగారు గురించి ఆలోచించి కొడుకు కోడలు
కళ్ళ ముందు ఉండాలని అంటారు దేనికైనా అదృష్టం ఉండాలి.
రమ్య ఒక కొడుకు తో సరి పెట్టింది ఇంటి పరిస్తితులకు తరచూ బాధ పడటం తప్ప చెయ్యి గలిగింది లేదు.అటు అత్త మాట ఇటు భర్త మాట ఎవరిని కాదన లేదు . ఎదురు చెపితే కురుక్షేత్రం చూపిస్తారు . ఇంట్లో గొడవలకి కొడుకు చదువుకోడు అంటూ విశాఖలో హాస్టల్ లో పెట్టీ సిక్త్. క్లాస్ దగ్గర నుంచి చదువుకు పెట్టారు ఇంటి పరిస్తితి తెలియకుండా చదువుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ డాక్టరేట్ చేసి విదేశాలకు వెళ్ళాడు.
ఇంకేమంది పిల్లాడి పెళ్లి చెయ్యండి అని బామ్మ గొడవ పెట్టింది.అత్తగారు.గొడవకు అంతా భయ పడ్డారు మళ్లీ ఏ అన్న పిల్లనో తెచ్చి చెయ్యి మంటుంది అనుకున్నాడు.తనకు చిన్న తనంలో. పెళ్ళిచేసారు పెద్ద వాళ్ళు స్వార్థంతో చేసిన ఈ పనికి తను బాధ పడుతున్నాడు.
పిల్లాడు గొప్పగా ఉండాలి అని పరి పరి విధాల అనుకునే వాడు.ఇదే మాట కొడుకుతో అన్నాడు . నా పెళ్లి గురించి వర్రీ వద్దు సమయమొచ్చినప్పుడు చూపిస్తా అన్నాడు దానితో వీడు ఎవరినో ఇష్టపడుతున్నారు అని తల్లి గ్రహించించింది.ఒక్ నీ ఇష్టం అనుకుంది అత్తగారు మాత్రం ఏవో బంధుత్వాలు గోత్రాలు ఏడు తరాలు అంటుంది
అత్తగారికి వంటేడు నగలు చంద్ర హారం వడ్డాణం చేమంతి బిళ్ళ వంకిలు డజను గాజులు ఇవి నా మనమడు పెళ్ళానికి
మీకు ఇల్లు పొలం ఇచ్చాను అనేది సరే ఎవరు తింటే కాదు తన కడుపున పుట్టిన పిల్లాడు అనుకున్నది .
నేను విదేశాలకు వెడుతున్నను నా పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో అయ్యింది అమే పేరు స్మిత తను నన్ను విదేశాలకు తేసుకెడుతొంధీ మీరు విమానాశ్రయనికి రండి అని వీడియో పెట్టాడు.
శాస్త్రి సంతోషించాడు. అత్తగారు మాత్రం .బాధ పడింది స్తోత్రిక కుటుంబం ముక్కు మొఖం తెలియని కుల గోత్రాలు తెలియని పిల్ల అనుకుంది
కానీ స్మిత కొడుకుకి పరిశోధన గైడ్ అని వారికి తెలియదు . అతని మెరిట్ చూసి స్మిత పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి పోయారు అప్పుడప్పుడు డబ్బు పంపుతాడు మనుమలు వీడియోలో చూసి మురుస్తారు .కాలం మార్పులో రమ్య డిటిపి నేర్చుకుని వర్క్ చేస్తోంది శాస్త్రి మాత్రం తన గొప్పలు చెపుతూ జమీందారు జీవిత గురించి కధలు రాస్తున్నాడు. కాలంతో పాటు ఖర్చులు పెరుగుతాయి .అతని ఏమి సంపాదించ లేదు సరికదా ఉన్నది బిజినెస్ పేరుతో ఖర్చు పెట్టేశాడు కొడుకు ఎదిగి.విదేశాలకు వెళ్ళాడు కొంత డబ్బు పంపితే చాలు అనుకున్నాడు ప్రభుత్వము ఇచ్చే పథకాలతో రమ్య కుటుంబం నెట్టు కొస్తోంది. ఒక ప్రక్క డోక్రా మరో ప్రక్క డిటిపి చేస్తూ సంపాదిస్తోంది.శాస్త్రి లో మార్పు లేదు. అన్నగారు అరిచి అరిచి  అల్లరి చేసి ఆందోళన పడినా ఫలితం లేనిది ఈ రోజు తనకి వింటాడా? కుటుంబ భారం రేషన్ అన్ని తనే చూసుకునేది కనీసం.స్కూటర్ మీద తీసు కెళ్ళే వాడు కాదు రమ్య కస్టపడి సరుకులన్ని తెచ్చింది శాస్త్రి వాటికి వంకలు పెట్టేవాడు కొడుకు విదేశాల నుంచి వస్తున్నట్లు చెప్పాడు కోడలు మాత్రం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెడటానన్నది ఇన్నాళ్ళకి వచ్చావు రా అమ్మ పిల్లలకి మేము పరిచయం అవుతాము
అన్నారు.
విమానాశ్రయం లో చూశారు పిల్లలని కోడల్ని అమే తల్లి తండ్రి వచ్చి తిసు కెళ్ళారు శాస్త్రి పిల్లలకి కొంత డబ్బు కోడలికి చీర పట్టు కెళ్లరు పుచ్చుకుని నవ్వింది .

ఇంటికి.విజయవాడ విమానాశ్రయం నుంచి తీసుకు వచ్చారు ఏరా మాతో ఒక్క మాట అంటే మేము వద్దని అంతనా అన్నాడు కొంచెం బాధగా కొడలు రానందుకు నోచ్చుకుంటును

అదేమీ కాదు నాకు అమే పిహెచ్ గైడ్ .తనకు పెళ్లి కాలేదు అందుకని మేము నిర్ణయం చేసుకుని పెళ్లి చేసుకున్నాము.

నేను ఇప్పుడు.కొంత డబ్బు తెచ్చాను దానితో మేము.స్థలం కోంటాను డెవలప్ అయితే పాతిక లక్షలు వస్తుంది నేను ఇప్పుడు పది పెట్టీ కోంటున్ననుఅందుకే వచ్చాను అన్నాడు.

శాస్త్రి రమ్య తెల్ల మొఖం వేశారు పెద్దలు ఇచ్చిన ఇల్లు ఉంది అది ఇప్పుడు పాత బడింది నీరు కారు తొంది దాన్ని బాగుచేయిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అంతే గాని ఎరగని చోట ఫ్రెండ్స్ కొన్నారంటు డబ్బు ఖర్చు పెట్టకు. అన్నాడు .పెడ చెవిన పెట్టాడు అమ్మ కస్టపడి.డిటిపి చేస్తోంది.నువ్వు పద్దల సొమ్ము ఖర్చు పెట్టవు.
ఇంకా ఎందుకు నీకు డబ్బు ఓ లక్ష రూపాయలు అమ్మ పేరున వేస్తాను నువ్వు అడగకు వడ్డీ తెచ్చుకుని తింటుంది.

ఆ మాటలకు రమ్య సంతో షించింధి..కొడుకున్న వారం రోజులు రకరకాల పిండివంటలు చేసింది

ఏ కులము అయితేనే బంగారం లాంటి మనమలు ఉన్నారు ఊరే వాళ్ళకి.మన తెలుగు కూడా నేర్పాలి అన్నది. అలాగే అన్నడు.వారం రోజులు ఇట్టే గడిచింది ఇల్లు బాగు విషయం చెపితే ఇప్పుడే గాస్థలం కొన్నాను వెంటనే బాగు అంటే అది మరో  ఐదు లక్షలు పడుతుంది మళ్లీ ఏడాది చూద్దాము నీకు నెలనెలా కొంత డబ్బు పంపుతాను అది సరి పెర్ట్టుకుని కొంతదాచు అని సలహా చెప్పాడు.హతోస్మి అనుకుంది.

సరే ఎదో పిల్లాడు.మమ్మల్ని.వడెలెయ్యకుండా చూస్తున్నాడు అంతే చాలు ఎంతోమంది పిల్లలు తల్లి తండ్రులని ఆశ్రమాలలో పెడుతున్నారు అనుకుంది .ఎక్కడ ఉన్నా సుఖం గా ఉంటే చాలు అనుకున్నారు.మళ్లీ విమానాశ్రయానికి వెళ్లి పిల్లాడిని ఎక్కించారు అక్కడే కొడల్ని మనమల్ని చూసి ఉార గాయాలు అప్పడాలు అన్ని ఇచ్చారు ఏ దేశం లో.ఉన్న జిహ్వరుచి మారదు దొరకని చొట ఇంక ఎక్కువ కావాలని పిస్తుంది. వెళ్లి క్షేమంగా చేరానని చెప్పారు ఈ లోగా ప్రపంచం అంతా తల్ల కిందు లైంది ఎక్కడ వాళ్లకు సుఖం లేదు ఉంద్యోగాలు లేవు సంపాదన లేదు వేరే ఉద్యోగం చూసుకోండి.కంపెనీలు మూతపడ్డాయి దాచుకున్న డబ్బుతో కొంత కాలం గడుపుతన్నారు.

అమ్మా ఇంక నేను డబ్బు పంప లేను మీకు ఒకసారి ఇచ్చిన డబ్బుతో గడుపు కొండి ఇక్కడ అప్పు పుట్టదు అక్కడ అయితే మీకు ఎప్పటి నుండో తెలుసు కనుక అరుపులు ఇస్తారు అని చెప్పాడు.రమ్య చాలా బాధ పడింది ఒక్కగానొక్క కొడుకు వాడి సంపాదన మీద ఆధార పడడం మంచిది కాదు అనుకుంది
పోనీలే ఎలాగో అలాగ మేము బ్రతుకు తాము నీకు చిన్న పిల్లలు దేశం గాని దేశం ఎలా బ్రతుకు తారో అనుకుంది. తల్లి ప్రాణం తల్లడిల్లింది. శాస్త్రి కి ఈ వేమి.పట్టవు.పోనీ ఇల్లు అద్దెకు ఇద్దమా.అంటే ఎవరు రారు పాతకాలం ఇల్లు.ఎక్కడి కక్కడ పెచ్చులు పెళ్లులు ఊడి పడుతోంది.ఇంకా రమ్య ధైర్యం చేసి తమ ఇల్లు డెవలప్ మెంట్ కి ఇచ్చి కొంతడబ్బు ఇచ్చేలా మాట్లాడు.కొని కొన్ని వాటాలు అమ్ముకునెలా మాట్లాడుదాము అంది శాస్త్రి ప్రతి విషయానికి వంక పెడతాడు వెటకారం .డాట్ కామ్ అంటుంది .ఏమైనా ఈ సంవత్సరం ఇల్లు బాగు పెట్టాలి అనుకుంది.

ఈ కళనున్నాడో కొడుకు సరే అన్నాడు నా స్థలం అమ్మి ఇద్దామంటే అక్కడ ఇప్పుడప్పుడే రాదు అని అన్నారు అన్నాడు.ఒరే నాన్నా తొందర పడ్డావు నువ్వు ఆనాడే చెప్పాను కదా
వినలేదు మతో ఆలోచించలేదు ఆడబ్బు ఈ ఇంటి మీద పెడితే అద్దె వచ్చేది మేము సుఖ పడే వాళ్ళము.అన్నది

అది కాదు అమ్మ.నాకు నా భార్య స్మిత చదువుకు విశాలకి ఖర్చు పెట్టింది అందుకని దాని జీతం పుచ్చుకున్న ను కదా అందుకని స్థలం కొన్నాను.అది పెరిగితే అమ్మి డబ్బు చేద్దాము
అనుకున్న కాని ఇప్పటి పరిస్తితిలో ఇప్పుడప్పుడే రేటు రాదు అందుకని మీరు మంచి బిల్డర్ కి ఇచ్చి ఇల్లు కట్టించి సుఖపడమనీ చెప్పాడు నిజమే తనకు యాబై దాటాయి. శాస్త్రి అరవై లో పడ్డాడు ఇంక సుఖం ఏమిటి అత్తగారు ఉన్నంత కాలం మడి ఆచారం తో సరి పడింది . ఎదో ఇప్పుడు కాస్త బయట పడి డిటిపి నేర్చుకుని తన కంటు సంపాదిస్తోంది..జీవన రవళి లో ఎన్నో శ్రుతులు అవన్నీ మనకు ఎన్నో.విషయాలు నేర్పుతారు.ఎది ఏమైనా మనిషికి సుఖ మైన ఇల్లు కడుపు నిండా తిండి కావాలి ధైర్యం చేసి శాస్త్రి మాట పక్కన పెట్టీ బిల్డర్ కి ఇచ్చింది
అక్కడ నుంచి కొడుకు సలహా తీసుకుంటూ రెండేళ్ళలో బిల్డింగ్ పూర్తి అయింది.మన వలకి ఇద్దరికీ చెరో వాట తన అనం తరము వచ్చేలా రాయింుకున్నారు..ఇక్క డ.ఒక్క సారి ఆలోచిస్తే మగవాడు చూడక పోయినా.ఆడది తన భర్త సుఖం కోరుతుంది. తను భర్త కన్న చాలా చిన్నది.అందుకే శాస్త్రి రమ్య మాట కదన లేదు ఉత్త్ రోత్ర కోడలు కొడుకు చూడక పోయిన ఆమె.బ్రతుకు ఆమె బ్రతకాలి. అందుకని ఇంట్లో ఒక గదిలో డిటిపి. సెంటర్ పెట్టీ ఇద్దరికీ ఉపాధి కల్పించి తన విద్యను అభివృద్ధి చేసింది కోటీశ్వరుడు భర్త అయినా రమ్య నేటి పరిస్తితి ని బట్టి అంచె లంచెలు గా ఎదిగి మంచి పేరు తెచ్చుకుని ఈ తరం మహిళలకు ఆదర్శం గా.కీర్తి పొందింది.

నేటి .పరిస్తితుల్లో స్త్రీ కూడా ఏదోరకంగా డబ్బు సంపాదించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.ఆర్థికంగా ఎదగడం కోసం కొద్ది చదువు ఉన్న స్త్రీలు కూడా వడియాలు అప్పడాలు ఊరగాయలు క్యాట రింగ్ ద్వారా కూరలు సపై చెయ్యడం వంటివి చేస్తూ కుటుంబ అభివృద్ధికి పాటు పడుతున్నారు. టైలరింగ్ వచ్చినవాళ్ళు చక్కగా రోజుకి రెండు మూడు జాకెట్స్ చీర ఫాల్స్ కుట్టి కూడా ఆర్థికంగా ఎదుగుతున్నారు.ఈనాడు ఎన్నో రకాల గృహకృత్య అంశాలు ఉన్నాయి ఉద్యోగినులు కూడా వీరిని చూసి అందరూ వారికి అవకాశం ఇస్తున్నారు.స్త్రీ లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నిజానికి విద్య వంతులు కంటే విద్య తక్కువ వారికి ఎన్నో అవకాశాలు ఉన్నయి అయితే వాటిని తెలుసుకోవడమే కష్టం అవకాశముంది. అంది పుచ్చుకుని ఎదగాలి.ఎన్నో రకాలుగా కుటుంబాలలో స్త్రీలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం కలిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు అయితే.ముఖ్యంగా ఇదే నాకు ప్రాప్తి అని కొందరు ఊరుకుంటే మరి కొందరు రమ్య లాంటి వారు జీవితానికి ఎదురు ఈదు తున్నారు .మహిళలు కుటుంబ నిర్వహణలో ఎంతో ప్రతిభ చూపి అందరినీ సంతోష పెట్టాలని చూస్తారు అందుకు అందరూ ఇంట్లో.సహకరించడం
అవసరమని గుర్తిస్తే చాలు అమే ఆనందానికి అంతు ఉండదు. ఒక్క చిన్న మెప్పు ప్రశంస ఇవ్వడం అలవాటు చేసుకొనండి. అప్పుడే జీవన రవళి లో ఎన్నో.స్వరాలు సమకూర్చ గలదు ఇంటి ఇల్లాలు రమ్య వలే విజయం పొందుతారు

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!