ఆలోచన ప్రభావితం

ఆలోచన ప్రభావితం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

‘అరే వినయ్, అంటే సుందరానికి మూవి బావుందట పద పోదాం అన్నాడు కమల్
టెన్షన్ గా ఉందిరా ఎందుకో, గోళ్లు కొరుక్కుంటూ చెప్పాడు వినయ్. తన రూమ్మేట్ కమల్ తో.
ఎందుకురా ఏమైంది. ఎక్కడికో వెళ్లొస్తానన్నావు,
వెళ్లిన పని అవ్వలేదా అడిగాడు కమల్. నా ఫ్యూచర్ గురించి అడుగుదామని ఒక స్వామీజీ దగ్గరకు వెళ్లాను. నా జాబ్ కు గండం ఉందని చెప్పాడు. అందుకే భయంగా ఉందిరా అన్నాడు
ఒరే ఎవరో ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా, నీకేమైనా పిచ్చిపట్టిందా ? మంచి కంపనీ లో జాబ్ చేస్తూ ఇవేమి డౌట్స్ రా బాబూ పిచ్చివన్నీ నమ్మకు. హేపీగా ఉండు.నీకొక ఎగ్జాంపుల్ చెప్పనా అన్నాడు. నా ఫ్రెండ్ ఒకడిగురించి చెప్పలేదు నీకు, వాడి పేరు యోగి. నేను, వాడు ఒకప్పుడు కొలీగ్స్. ఒకరోజు ఏమయ్యిందంటే, రాత్రి హాయిగా నిద్రపోయి, పొద్దున్నే లేచి, వ్యాయామం చేసి, ఆ తరువాత స్నానం ముగించి, భోజనం పూర్తిచేసి ఆఫీసుకి బయలుదేరాడు యోగి. సరిగ్గా అప్పుడే పక్కింటాయన ఎదురై, ఏం బాబూ! డల్ గా ఉన్నావు. ఒంట్లో బాగా లేదా? అంటూ పలకరించాడు. అబ్బే ..అదేం లేదండీ బానే ఉన్నాను. అని చెప్పి వీధి మలుపు తిరుగుతుండగా మిత్రుడు ఎదురై, ఏరా ఏమైంది నీకు ? ముఖమంతా వాడిపోయింది? అని ఎంతో ప్రేమతో పరామర్శించాడు. బానే ఉన్నాను రా బాబూ
నవ్వుతూ చెప్పి, ఆఫీసు లోకి అడుగు పెట్టాడు, యోగి. అతన్ని చూస్తూనే ఏమిటి సార్ ,జ్వరమా? కళ్ళు లోతుకి పోయి ఉన్నాయే! ఇంటినుండే ఫోన్ చేసి శలవు కావాలని చెప్పొచ్చుగా అన్నది. రిసెప్షనిష్టు ఎంతో జాలి కనబరుస్తూ. ఇంటినుంచి బయలుదేరినప్పుడు యొగిలో నిండిన ఉత్సాహం, చురుకుదనం అంతా కొంచెం కొంచెంగా ఆవిరిపోసాగాయి. నిజంగానే తనకు జ్వరం వచ్చిందేమోనని భావించి శలవు పెట్టేసి ఇంటికి వచ్చేసాడు యోగి. నవ్వుతూ చెప్పాడు. నిజానికి వాడికి ఏమీ లేదు. అంటూ మన ఆలోచనలను బట్టే  మన ఆనందం ఉంటుందిరా ! మన ఎనర్జీ ఫీల్డుని బలపరచి ఎప్పుడూ ఆనందంగా ఉండటం నేర్చుకో! మనం మనల్ని ఏ రకంగా భావించుకుంటామో కాలక్రమేణా మన వ్యక్తిత్వం ఆవిధంగానే తయారవుతుంది. మాటల్లోనే కాదు, నీ అంతరంగపుటాలోచనల్లోసైతం నిరాశాభావాలకి చోటివ్వద్దు. యోగి పరిస్తితి విన్నావా ? అలా ఉంటుంది, పక్కవారి మాటల ప్రభావం అంటూ చెప్పాడు కమల్. నిజమే చెప్పావు రా సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే నడు సినిమాకు పోదాం అంటూ బైక్ స్టార్ట్ చేసాడు వినయ్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!