గురువులు
రచన:: సుశీల రమేష్.M
నాలో వివేక జ్యోతిని వెలిగించి.
నా నైపుణ్యాన్ని మెరుగుపరచి.
నన్ను ప్రగతి పథంలో నడిపించి.
నేను ఉన్నత స్థానానికి చేరుకునే
శిక్షణ ను అందించి
మంచి చెడులను తెలియపరచి
అంధకారం అజ్ఞానాన్ని తొలగించి.
జన్మ దాతల తర్వాత స్థానం
మీకు ఆపాదించిన
జగతిన మిమ్ములను మించిన
సారధులు లేరంటూ విద్యార్థులను
రేపటి పౌరులు గా తీర్చిదిద్దే
గురువులకు నా పాదాభివందనం.
***