విశ్వైకగురువు

విశ్వైకగురువు

రచన:: మక్కువ. అరుణకుమారి

సనాతన భారతీయ ధర్మం అంది
అజ్ఞానాంధకారాన్ని తరిమివేసే వారే గురువులని
ఆధునిక భారతీయ పోకడలో నేనంటాను
గు రుతరమైన బాధ్యతను తమ
రు జువర్తనంతో ప్రత్యక్షంగా
వు టంకీంచే వారే గురువులని
వారికి నా శత సహస్ర వందనాలు

జగద్గురువు శ్రీకృష్ణులు
ఆదిగురువు శంకరాచార్యులు
విశ్వగురువు వివేకానందులు
ఏరి వారిని మించిన గురువులు?
వారికి నా శత సహస్ర వందనాలు

నాడు గురుకులాలు గురువులు
విద్యార్ధి జీవిత గమనానికి నిర్ధేశకులు
నేడు బడులే గుడులు
ఆ గుడిలో దేవుళ్ళే గురువులు
వారే ప్రపంచ గమనానికి దిక్సూచీలు
వారికి నా శత సహస్ర వందనాలు

నేటి వ్యాసజయంతి గురుపౌర్ణమి
గురువులందరికి పర్వదినం
ఈ పర్వదినాన ఓ జ్యోతిబాపులే,ఓ సావిత్రి బాయి
ఓ సర్వేపల్లి ఓ కందుకూరి
ఓ గురజాడ
ఎందరో గురువులు
జాతిని నడిపిన ధీరువులు
వారందరికీ నా శత సహస్ర వందనాలు

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!