సూర్యాలు

సూర్యాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణిప్రభాకరి

సూర్యుడు తో పోటీ పడి సూర్యాలు. అమ్మమ్మ తాతయ్య వెంట ఉంటుంది. ఏది చెప్పినా? ఎంత సేపు? అంటుంది కానీ ఏమీ చెయ్యదు. తల్లి పూర్ణ పిల్లని సిటీ లో స్కూల్ కి పంపడం కష్టం ఇది చిన్న ఊరు నాన్న మాస్టారు కనుక ఎదో. ఇంటర్ పూర్తి చేయిస్తాడు అని ఉంచింది. సూర్య కి అమ్మమ్మ అన్ని నేర్పేది ఎదో పద్దెనిమిది ఏళ్ళకి టెన్త్ పాస్ అయింది కొంచెం నెమ్మదిగా ఉంటుంది. బజారుకి తీసుకు వెడితే కావాల్సినవి అక్కర లేనివి అన్ని కొంటుంది. ఎలాగైనా పెళ్లి చెయ్యాలి ఈ ఏడాది అన్నారు. కొంచెం డబ్బు ఉన్న సంబంధం దగ్గర సంబంధం చేస్తే మంచిది. పల్లెటూరు అయితే నయం పట్నంలో జీవించ లేదు. పట్నం సంభందాలు జోష్ హోష్ లు డాబుల దర్పలు కుదరవు. మాకు నెమ్మది పిల్ల కావాలి డబ్బు ఉంటే చాలు చదువు అవసరం లేదు అన్నారు. సరే శ్రీనివాస్ కి ఈ పిల్ల సరిపోతుంది. పెద్ద సంబంధం అన్నాడు సరే పెళ్లి చూపులుకి బాబయ్య, మావయ్య తల్లి తండ్రి వచ్చారు. పెద్ద కార్లో వచ్చారు. ఊళ్ళోకి పెద్ద కారు వచ్చిందంటే అది సూర్య వాళ్ళింటికి ఆ ఊరికి వాళ్ళు పెద్ద మెడ వారు. అదేమీ కారు అని సూర్య అడిగింది అది బీ ఎం డబ్ల్యు కార్ అన్నారు. సూర్య విచిత్రంగా ముఖం పెట్టీ బీ ఎం డబ్బా కారా అంటూ ముఖం విసుగ్గా పెట్టింది. సూర్య తల్లి తండ్రి కూడా వచ్చారు సూర్య తండ్రి బాగా సంపాదించాడు కూడా
సూర్య నీ సిటీ లో కార్లో తీసుకు వెడితే లక్ష పట్టుకెళ్ళి నా చాలదు. కాఫీ లు ఇచ్చారు పెళ్లి కొడుక్కి కారం ఇష్టం _తీపి తినడు. మధురం ఇష్టం ఉండదు ఏదైనా ఆరోగ్యంలో తేడా ఉన్నదా అని ప్రశ్న వచ్చింది. కారం ఎక్కువ తింటే అహంకారం అంటారు. కదా అబ్బే మమకారం ఎక్కువ అండి పెద్దల పై గౌరవం భార్య అంటే ప్రేమ, మా వాడికి గోరింటాకు ఇష్టం చెయ్యి ఎంత బాగా పండింది
చూడండి అని మేన మామ అన్నాడు. ఏమిటి ? గోరింటాకు పెట్టుకున్నారా! పిరికి తనం వస్తుంది అంటారు. షూగర్ కాఫీ లో వెయ్య వచ్చా? అంటూ పెళ్ళికూతురు అన్నది అప్పుడే మీ పిల్లకి మా వాడంటే ఎంత ప్రేమో హా హా అది అంతే ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తూ ఇలా అడగ మంటామ్ మిమ్మల్ని అలాగే అడిగింది హా హా అన్నది అమ్మమ్మ
అంటే షూగర్ ఉన్నదా! అందులో పెళ్లి కొడుకు బాగా వేడిగా తాగుతాడు. కాఫీ వేడి చేసి తెమ్మన్నారు.
వెచ్చ బెట్టిన గిన్నెను రుమాల్ తో తీస్తుంటే  కార్తో తే లేక పోయారా రుమల్తో పట్టుకుంటే వేడి పట్టదు కార్ తెండి కార్ తెండీ అంటూ పెళ్ళికొడుకు బాబయ్య గట్టిగా అనేటప్పటికి వంట మనిషి ఖంగారూ పడి గిన్నె వదిలేసింది. అంతా కింద పడింది. మళ్లీ తెస్తాను అంటు లోపలికి వెళ్ళింది. అందుకే చెప్పను కార్ తో తీసుకు రండి అని కార్లో ఎలా తెస్తాం సర్ అన్నారు. అదా మా ప్రాంతంలో పట్టకార్ నీ కార్ అంటారు. అంతే కాదండోయ్ ఇంకా చిత్రం, మా ఆవిడ మిరియాలు చారు పెట్టవే అంటే మినికార్ కొంటారా మనకి పెద్ద కారు కొనాలి అంటుంది.
కొంచెం వెటకారం డాట్ కామ్. మా సూర్య కూడా అమ్మమ్మ మాదిరి అప్పుడప్పుడు అంటుంది
పెళ్లి కూతురు మంచి హాస్యం పండిస్తోంది అన్నమాట, ఉన్నమాట వాస్తవమే పిల్ల చలాకీగా ఉంటుంది మొన్న రవ్వల గాజులు కావాలి అన్నది వెంటనే ఆర్డర్ చేసింది. కొత్తువాడు ఇంటికి తెచ్చాడు చూసి డబ్బు తాత గారు ఇచ్చారు. అబ్బో ఖరీదయిన సరదాలే మొన్న మా కుర్రాడు మార్కెట్ లో కొత్త రకం కార్లు వచ్చాయి. అది కొంటె గాని వీలు లేదు అన్నాడు మా ఊరే నీ పెళ్లికి మీ అత్త వారు బహుమతి ఇస్తారు అని చెప్పడం విన్నాను. అల్లుడికి ఇస్తే మీ అమ్మాయి సుఖం గా ఉంటుంది అన్నాడు. మొత్తనికి అందరూ ఘనులే అంటు నాగ వల్లి పత్రాలు అదేనండి తాంబూలాలు పుచ్చు కున్నారు. పెళ్లి కూతురు ముద్దు గారే యశోదా అంటు పాడింది. ఈలోగా అమ్మమ్మ పొడగంటీ మయ్యా మమ్ము పురుషోత్తమా పాడ మన్నది
ఏమిటి పిల్లలకి పాటలు బాగా వచ్చే ఈ విషయం చెప్పలేదు. అబ్బే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అంటు అందుకున్నది చివరగా హారతి పాట అని పురోహితుడు అనగా క్షీరాబ్ధి కన్యక కు శ్రీ మహా లక్ష్మికి అంటు చక్క గా పాడింది. మీ పిల్ల మంచి పాటలు పాడింది మాకు సంగీతం వచ్చిన పిల్ల దొరకడం అదృష్ట ము అన్నారు. ఆహ మీరు తక్కువా ఏమిటి? ఆ మధ్య బీరకాయలు పెద్దవి కేజి తెమ్మంటే  బీరు కాయలు పెద్ద సీసా తెచ్చారు.
నాగ వల్లీ పత్రాలు తెమ్మంట్ ఉల్లి పాయలు తెచ్చారు. మజ్జిగ మిరపకాయలు తెమ్మని అంటే కొట్లోకి వెళ్లి మజ్జిగ మిరప కాయలు అంటే కొట్టువాడు అలాంటివి లేవంటూ వెళ్ళ మన్నాడు
ఓ సారి మీ తాత గారు కాళ్ళ పట్టిలు పట్టుకు రండి అంటే  కిల్లి పట్టి సామాను తెచ్చారు. ఏమిటో పెద్ద వాళ్ళం మాకు కొంచెం పల్లెటూరు పద్దతులు
ఏమి అనుకోకు సరదాగా మీ కు అన్ని చెప్పాము
ప్రాంతానికి ప్రాంతానికి పడికట్టు పదాలు ప్రయోగించడం తేడా ఉంటుంది. మేము ముందు గదిని వీధి గది అంటాం. మా అల్లుడు ఏమిటి
అత్తయ్య నన్ను వీధిలో కూర్చో పెడతారా అంటారు.
పదాలు అర్థం మార్చి పెడ అర్ధాలు అనుకోకుండా పెద్ద మనసుతో మా పిల్లను చేసుకోండి అని అమ్మమ్మ తాతయ్య పెళ్లి వారికి చెప్పారు. పిల్ల కేమి బంగారు బొమ్మ అమ్మమ్మ అస్తి అప్పిల్లకి ఇస్తారు కూతురు వాటా కూతురుకి ఇచ్చి మనవరాలికి
ఎంతో ప్రేమతో అమ్మమ్మ కట్నం ఇస్తోంది. పెళ్లి వారు మేము సర్దుకుని పిల్లను మాకు కావాల్సిన విధానంలో మార్చుకుంటే సరి, పుట్టుకతో అన్ని రావు అని సర్దుకున్నారు. కదిలి వచ్చే శ్రీ మహా లక్ష్మి ఎవరూ వద్దంటారు చెప్పండి. అతి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. పిడి కిట తలంబ్రాలు పెళ్లి కూతురు అని సన్నాయి లో శ్రీ అన్నమయ్య కీర్తన శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్లి కీర్తన వాయిస్తూ గట్టి మెళంలో వాయించారు అందరూ ఆనందంగా దీవించారు. పెళ్లి విందు ఘనంగా ఉంది
వెండి కప్పులు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. అవి కూడా పెద్ద పెద్ద చెవులు ఉన్న బహుమతి కప్పులు చూడటానికి హాస్యంగా ఉన్నాయి. ఎవరైనా పెళ్ళిలో అటక పాటల పోటీ కప్పులు పంచి పెడతారా చెప్పండి మరీ మన సూర్యాలు పెళ్లి చిత్రం మాటలు చిత్రమే కదా శాంతి శుభము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!