ప్రత్యక్ష దేవతలు

ప్రత్యక్ష దేవతలు

రచయిత :: యం. సుశీల రమేష్

గాంధీ హాస్పిటల్ 80 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ తో బాధ పడుతుంది. బాత్ రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. మంచం మీదే అన్ని సేవలు చేస్తుంది గీత అనే నర్సు.

ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకోవడం వలన పదిహేను రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది బామ్మకు చక్కగా మాట్లాడగలుగుతుంది.

అమ్మ గీత అంటూ పిలిచింది బామ్మ!

ఏంటి బామ్మ అంటూ వచ్చింది గీత.

చేతులెత్తి దండం పెడుతున్నా బామ్మని వారించింది గీత.
నేను దండం పెట్టేది నీలో ఉన్న దేవతా రూపానికి తల్లి, కాళ్ల మొక్కలనిఉంది కానీ అలా చేస్తే మీ ఆయుష్షు తగ్గుతుందేమో అని భయమేసి దండం పెడుతున్నాను అంటుంది బామ్మ.

ఊరుకో బామ్మ అంత పెద్ద మాటలు ఎందుకు అంటుంది గీత.

అవును తల్లి ఇక్కడే ఉంటున్నావు ఇంటికి వెళ్ళావా నీకు పెళ్లి అయ్యిందా అని అడిగింది బామ్మ.

నాకు పెళ్లయింది నాలుగేళ్ల బాబు ఉన్నాడు. నేను ఇంటికి వెళ్లి సపరేట్ రూమ్ లో ఉండాలి. బాబేమో ఒకటే ఏడుపు మమ్మీ కావాలని, బాబు ఏడుపు విని తట్టుకోలేక వెళ్లడం లేదు బామ్మ ఇంటికి అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది గీత.

ఊరుకో తల్లి ఇలాంటి కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు భగవంతుడా అంటూ దేవుడికి దండం పెట్టింది బామ్మ.

అవును తల్లి నీతో పాటు మరో ముగ్గురు ఉండాలి ఎక్కడ అని అడిగింది బామ్మ.

బేగం సుజాత గాయత్రి బామ్మ.
సుజాత గాయత్రి ఉన్నారు. బేగం మాత్రం ఇంటికి వెళ్ళింది రేపు ఉదయం వస్తుంది తన పిల్లలు తనకు ఎంతో సాయం చేస్తారు.
కొంచెం పెద్ద వయసు కదా అందుకే మేము చూసుకుంటాము మేము వెళ్ళామన్నాం.

సుజాత గాయత్రి నేను మీతో పాటు మీ రూమ్ లో ఉంటాము అని చెప్పింది గీత.

అవును తల్లి నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఈ కిట్ లోనే ఉన్నారు వీటిని తీయరా తల్లి అని అడిగింది బామ్మ.

లేదు బామ్మ మేము వీటిని తీయకూడదు. కరోనా వైరస్ సూక్ష్మంగా ఉంటుంది కదా.

నీకు తెలుసా బామ్మ పిపిఈ కిట్ వలన మాకు ఎంత ఇబ్బంది గా ఉంటుంది.. కనీసం బాత్రూం కి కూడా వెళ్ళలేము అని చెప్పింది గీత.

మరైతే తల్లి పీరియడ్స్ అప్పుడు ఎలా అని అడిగింది బామ్మ.

బామ్మ అప్పుడైతే నాకు ప్రత్యక్ష నరకం, ఇంతకన్నా చెప్పలేను. వళ్ళంతా చెమటతో తడిసి పోతుంది. తినడానికి కూడా సాధ్యపడదు, కనీసం తల పై నుండి కళ్ళలోకి కారే చెమట ను కూడా తుడుచుకో లేము.

పోనీ ఇంటికి వెళదామా అంటే మా ద్వారా కుటుంబ సభ్యులకు ఎక్కడ కరోనా సోకతుందో, అనే భయం, పిల్లలను దగ్గరికి తీసుకోలేని మనసు విలవిల్లాడిపోతోంది.

ఒక్కొక్కసారి ఈ కిట్ వలన డీహైడ్రేషన్ కి గురౌతాము. కరోనా రోగులు మమ్మల్ని బతికించండి అంటూ చేతులు పట్టుకుని బ్రతిమాలు తారు ఆ క్షణంలో మేము కూడా ఆ దీనావస్థ కు ఏడు స్తాము.

ఈ కిట్ వలన మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా మీరంతా కోలుకుని ఇళ్లకు వెళ్తుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది.

పవిత్రమైన నర్సు వ్రృత్తిని ఎంచుకున్న తర్వాత వెనకడుగు వేయలేము. ఎందుకంటే ఈ వృత్తిని మేము దైవం గా భావిస్తాము. కానీ బామ్మ చాలామందికి నర్సులు అంటే చులకన భావం ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మా ప్రాణాలు ముందు తక్కువే. మా సేవల్ని గుర్తిస్తే చాలు అంతకన్నా మాకు ఏమీ వద్దు బామ్మ. అని చెప్పడం ముగించింది గీత.

బామ్మా రేపు నిన్ను అదిగో అక్కడ ఉన్న ముగ్గురిని ఇంటికి పంపిస్తారు. మీ నలుగురికి కరోనా పూర్తిగా తగ్గింది. అని చెప్పింది గీత.

నిజమా తల్లి నిజంగా మమ్మల్ని ఇంటికి పంపుతారా అంటుంది బామ్మ. అవును బామ్మ నిజం అంటుంది గీత.

మర్నాడు బామ్మ తో పాటు మరో ముగ్గురు నర్సు లు అందరికీ దండం పెడుతుంటే వారించింది గీత.

తల్లి మా తోడ బుట్టిన వారు కట్టుకున్నవారు మేము కన్నవారు, దగ్గరకు రాని కరోనా కాలమిది. అలాంటి పరిస్థితుల్లో మాకు అన్నీ మీరే అండగా ఉండి అమ్మలా అన్నం పెట్టి దిగులుగా ఉంటే స్నేహ హస్తం అందిస్తూ మమ్మల్ని ఓదారుస్తున్నారు. దాదాపు ఎనిమిది గంటలపాటు పి పి ఈ కిట్ ధరించి వల్లంతా తడిసి ముద్దవుతున్నా చెరగని చిరునవ్వుతో ఓర్పుతో సేవలందించారు.

మీ తోటి వారికి వైరస్ సోకుతున్నా చెక్కుచెదరని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు సూచించిన చికిత్సను రోగులకు పరిపూర్ణంగా ఇరవైనాలుగు గంటలు కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడు తున్నారు.

అందుకే మీరు కనిపించే దేవతలు.తల్లి మీకు దండం పెట్టేది మీలో దేవతకి అంటే కన్నీటితో వీడ్కోలు పలుకుతూ బామ్మ తో పాటు మరో ముగ్గురు వెళ్లారు తమ ఇళ్ళకు.

నర్సులను చిన్న చూపు చూడకండి. వారికి చిన్న మెచ్చుకోలు చాలు కొండంత ధైర్యం ఇచ్చిన వారమవుతాము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!