నిరీక్షణ

నిరీక్షణ

ఓ ప్రియతమా నీ కొరకై

నా మది చేరెను భువి నుండి దివికి
విహంగమై విహరిస్తూ

కనుల ముందు నిలిచిన నే కలగన్న స్వప్నానివో….

శిల లాంటి నా మనసును ప్రేమ ఉలితో చెక్కిన అద్బుత శిల్పివో…

ఎవరివో… నీ వెవరివో…

నన్ను ఎందుకు ఇలా మైమరపింప జేశావో….

తెలియని ఈ ప్రశ్శలకై సమాధానాలను అన్వేషిస్తూ….

నా ప్రేమ సామ్రాజ్యంలో అలుపెరుగక అనునిత్యం నీ ఊహల్లో విహరిస్తున్నా

వెయ్యి కన్నులతో నీ ముగ్ద మనోహర సుందర నగుమోముని తనివితీరా చూడాలని…

లెక్కలేనన్ని మధురమైన ఊసులు చెప్పాలని…

నా మానస చోరుడవైన నీ కొరకు నిరీక్షిస్తున్నా

కోటి ఆశలతో నీ ప్రేమ కోసం వేచివుండే నా ఈ నిరీక్షణను అడవి గాచిన వెన్నెల చేయక

నను దరిచేరగ రావా ప్రియతమా…

రచయిత: నాగ మయూరి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!