విముక్తి

అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?

విముక్తి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

అగణనీయ ఉద్యమ స్ఫూర్తితో
గణనీయ పోరాటం సలిపి
స్వతంత్ర సముపార్జన చేసి
పరతంత్ర భావజాలం కూడా మాకు వలదంటూ
మము మేమే పాలించుకుంటామంటూ
ప్రజలచే ప్రజల కొరకు ప్రజల వలన
సర్వజన హితమై,సర్వజన సమ్మతమై వెలిసిన
గ(ఘ)ణ స్వతంత్ర్య ఫలాలు నేడు
చిత్ర విచిత్ర పోకడల అపహస్యమై,
విషతుల్యమవుతున్నాయి.
మరి దీనికి విముక్తి కలిగేదెన్నడో?
జాతి మురిసేదెన్నడో!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!