నా హృదినేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                నా హృదినేస్తం

రచన ::గాయత్రి

ఎగసి పడే కెరటాలలో…..
నీ అల్లరి ని చూసుకుంటున్నా అను క్షణం  …..

నర్మగర్భం గా ఉన్న  సంద్రాన్నీ చూస్తుంటె …..
నీ మౌనమే కనపడుతున్నది ప్రతీ క్షణం ……

తీరం అందుకోవాలని అందుకోలేక నిరాశ తో వెనక్కి వెళుతున్న
ఆ అల ని చూస్తుంటే నువు నాకై పడే తపన కనపడుతున్నది క్షణ క్షణం ……

నీ హృదయపు లోతులలో నా కై పడే తాపత్రయం నా కనుదాటిపోలేదు సఖి….

కడలి లో వీచె చల్లని గాలి నా మేను ని తడుముతుంటె….
నీ వెచ్చని ఙ్ఞాపకాలు నా మదిని మీటుతున్నవి ప్రియా….

నీతొ  ఏడడుగులు వేయాలని…..
నీ కళ్లలోకి చూస్తూ నీకై నేనున్నా అని చెప్పాలని…..
నీ కష్టం లో…నీ సుఖం లో…
నీ బాద లొ….నీ సంతోషం లో…

జీవిత చరమాంకం వరకు నీకై
ఎదురుచూస్తూనే ఉంటాను నా ప్రాణమా….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!