(అంశం : నా అల్లరి నేస్తం) నేస్తమా.. నా ప్రాణమా..
రచన ::శ్రీలత. కే
నాతో నేను ఒంటరిగా ఉన్న సమయాన
నీ స్నేహపు పరిమళాలు వెంబడించి
నీతో జతకట్టేలా చేసాయి.
నీ పిలుపుతో నాలోని మౌనాన్ని దూరం చేసి
అలుపనేది లేకుండా మాటలలో ముంచేసావు.
నీ ప్రేమతో నాలోని ఒంటరితనాన్ని దూరం చేసావు
నా మదిలోని భావాలు నీతో పంచుకునేలా చేసావు.
నువ్వు తోడుంటే సమయం తెలియదు
నువు లేకపోతే నిముషం గడవదు.
నన్ను నీలో దాచేసి.. నిన్ను నాలో వదిలేసి
ఎందుకు ఈ మౌనం ఇద్దరిమధ్య..
దూరం అవటానికే దగ్గరైతే ఇక
ఎప్పటికి దూరంగానే ఉండు నేస్తం
కానీ ఎప్పటికి..
నువ్వే నా మొదటి నేస్తం
నువ్వే నా మొదటి ప్రేమ.