బోల్తా కొట్టింది

అంశం: హాస్యం కవిత

బోల్తా కొట్టింది
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

ఆకాశాన్నంటుతున్న ధరల్లా
చక్కెర శాతం పెరిగిపోతోందీ!
స్టాక్ మార్కెట్ విలువల్లా
ఎప్పుడూ బోల్తా కొడుతూ ఉంటుందీ!
అటూ ఇటూ అయ్యిందంటే
మత్తుగా గమ్మత్తుగా ఉంటుందీ!
ఏ వ్యసనాలు లేని నన్ను
కట్టు బానిసని చేసిందీ!
అలవాట్లన్నీ మార్పించి
శీర్షా’సనాలు’ వేయిస్తుందీ!
పాయసం పేరు చెప్పగానే
కడుపులో మంట పుడుతుందీ!
మందులకయ్యే ఖర్చు
ముందే ఆరోగ్యానికి పెడితే
బాగుండేదనిపిస్తుందీ!
ఇకనైనా మించిపోలేదే
కళ్ళు తెరిచి జాగ్రత్తలు పాటిస్తే
క్రమంలో మందులు వాడితే
నియంత్రణ లోనే ఉంటుందీ!

You May Also Like

One thought on “బోల్తా కొట్టింది

  1. అవును. కాని, అనుభవం అయితే కాని, ఆ జ్ఞానం రాదు. సూపర్ చెల్లి👌👌😄😄🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!