ఏన్ళాళ్ళీ బానిసత్వం?!

(అంశం:”బానిససంకెళ్లు”)

ఏన్ళాళ్ళీ బానిసత్వం?!

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

చాలు ఇకచాలు చీకటిరాజ్యంలో గడిపిన బానిసబ్రతుకులు
ఆంగ్లేయుల అరాచకత్వంతొ వేసిన బానిససంకెళ్ళు
తెంచుకొని సాధించుకున్న స్వాతంత్ర్యం
చీకటిగదిలో గడిపిన ఆ చీకటికష్టాలు చేధించుకున్నాం
స్వేచ్ఛావాయువులను పీల్చుకొన్నాం
బానిసత్వం పోయిందా?
బానిసబ్రతుకులు మెరుగపడ్డాయా?
ఎన్నో బానిసత్వపుసంకెళ్ళలో కట్టబడిపోయాం
అవును నిజం
కాదంటారా?!
భావదారిద్రపు సంకెళ్ళలో బంధీలమైపోలేదా?
పెత్తందార్లు దోరస్వాములు కొత్త అవతారమెత్తారుకదా!
ప్రజాపాలనలో ధనస్వాముల బానిససంకెళ్ళలో చిక్కుకోలేదా?
పసిపిల్లలనుండి పడుచుపిల్లలవరకు కామాంధుల
బానిససంకెళ్ళలో మగ్గుతున్నారెందరోకదా!
ఈ ఆర్ధిక సామాజిక సాంస్క్రతిక దాస్యశృంఖలాలు
ఏన్నాళ్ళు?
ఎప్పడు విముక్తి కలిగేను?
ఎవరు విముక్తులను చేస్తారు?
మనకు మనం మన భావదాస్యంనుండి విముక్తులమవ్వాల్సిందే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!