నా వూపిరే నీవు

*నా వూపిరే నీవు*

అంశం::నిన్ను దాటి పోగలనా

ఎదలో కమ్ముకున్న బాధల మేఘాన్ని కప్పేస్తావు
నీవో సూర్యుడవై..
సంతోషపు సుమాలను ఏరుతుంటే తేనియలు తాగుతావు
నీవో భ్రమరమై..

అలసిన వేళ సేద తీర్చే అమ్మవు నీవే…
అలక చెందిన వేళ బుజ్జగించే అన్నయ్యవు నీవే..
దోబూచులాడుతున్న మనసుకు ఆటబొమ్మవు నీవు..
నైతిక విలువలకు నాంది పలికే బామ్మవు నీవే..

ఎల్లప్పుడూ అండగా వుండే అమర ఖడ్గం నీవే
దిక్కుతోచని సమయాన సన్మార్గం నీవే

హృదయంలో వీచే భావ గాలులకు
తట్టుకుంటూ నిశ్చయంగా నిలిచే మహావృక్షం నీవే..

ఓదార్పువైనా,ఏ తీర్పునిచ్చినా
కాలానికైనా ఎదురీదగల కలానివి

నా చేతి వేళ్ళకు నీవో నేస్తానివి
నేను శ్వాసనైతే నీవే వూపిరివి
శ్వాస ఉన్నంత కాలం వూపిరి నిలిచే ఉంటుంది
కవిత ప్రాణమై బాసిల్లుతుంది..

నిన్ను దాటి పోగలనా మరి
నన్ను నేను దాటేంత వరకు
నా చివరి మజిలీ వరకు
నిన్ను వదిలి వుండగలనా!!

రచయిత :: స్వాతికృష్ణ సన్నిధి

You May Also Like

One thought on “నా వూపిరే నీవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!