జీవితం

జీవితం

రచయిత :: పి. వి. యన్. కృష్ణ వేణి

మనసు లేని తెల్ల కాగితం ఈ జీవితం
ప్రేమమయ జగత్తులో అది ఒక ఓ శాసనం
నిన్ను ప్రశ్నించే ఎన్నో భవిష్య చిక్కు ప్రశ్నలు
నిన్ను నువ్వు మరిచి ఆడే ఓ జీవన చదరంగం
గెలుపు ఓటమిల, కష్టసుఖాల సమతూకం,
ఎదో తెలియని మనసుని కలవరపరచే ఆరాటం,
ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆప్యాయతల మద్య ఈ జీవితం
తీరని మనో వేదనలు, తెగిపడని భందాలు
హంగులు – ఆర్బాటాలు, కోప – తాపాలు అన్నీ నామమాత్రమే
మాట ఒక్కటే శాశ్వతం, మనసుకే ఉండును నిజత్వం
ఎన్నో వేల మైళ్ల ప్రయాణం, వ్యయ ప్రయాసల ఈ ప్రపంచంలో
కానీ తీరం ఒక్కటే, అందరి జీవిత గమ్యం ఒక్కటే
అన్నీ నామమాత్ర ప్రయాణాలే అయినా, భగవంతుడే ఆ తుది తీర్పు ఇచ్చేది
నీ తుది పయనం ఆ దైవం చెంతకే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!