పెళ్లిసందడి

పెళ్లిసందడి

రచన :: సుజాత

హాలు  అంతా పెండ్లి హడావుడితో కళకళలాడుతోంది ఎవరి పనిలో వాళ్లు తిరుగుతూ హడాహుడిగా ఉన్నారు.ఒకరి మాట ఒకరు అర్థం  చేసుకునే పరిస్థితులు లేవు అక్కడ ఒకరి  నగలు ఒకరు చూసుకుంటూ వాళ్లు  మురిసిపోతున్నారు  ఒకరు వచ్చి వదిన నీ చీర చాల బాగుంది ఎక్కడ కొన్నావ్ అని అడుగుతున్నారు. మరొకరు వదిన ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నారు ఎంతైంది అంటూ. మరొకరు ఇలా ముచ్చట్లు పెడుతున్నారు  ఎంతైనా ఆడవాళ్లు కదా ఇలాగే ఉంటాయి.

ఆర్కెస్ట్రా  పాటలు  మ్యూజిక్ కోలాటాలు పిల్లల హడావుడి ఇంకా  ఎన్నెన్నో  కార్యక్రమాలు జరుగుతున్నాయి పిల్లల మొహాలలో  ఆనందం  కనబడుతుంది. ఒకటే హడావుడి చేస్తూ ఆడుతున్నారు పిల్లలందరూ  బుట్టగౌన్లో  అందంగా ఉన్నారు.హాలంతా రంగులతో  ఇంద్రధనస్సులా వెలిగిపోతోంది.

ఆ హాల్.అందరిని  ఆశ్చర్యపరిచేలా అలంకరించారు   వచ్చే వాళ్లకు  అత్తర్లు చల్లుతు గులాబీ పూలు ఇస్తూ స్వాగతం పలుకుతున్నారు వధువు తల్లిదండ్రులు స్టేజిపైకి రావాల్సిందిగా అని పురోహితుడు అనౌన్స్ చేస్తున్నాడు వదినా అన్నయ్య పిలుస్తున్నారు ఇక్కడ ఉన్నారా మీరు అంటూ ఆడపడుచు శోభ వచ్చింది. నీ కోడలు చూడు తెగ హడావుడి పడుతోంది.శోభా దాని దగ్గరే ఉండి ఏంటో అడిగి తెలుసుకో సరే మీరు ముందు వెళ్ళండి వదిన అంది అయ్యో మర్చి పోయాను శోభ నీవే  దగ్గరుండి తీసుకురా అన్నది.సరే వదినా అంది శోభ

సరేనమ్మా వెళ్తాను అంటూ వెళ్ళింది. సుందరి  ఎటు వెళ్ళావు  పెళ్లి మంటపంలోకి  వరుడి తల్లిదండ్రులు వచ్చి ఉన్నారు పూజ అవుతుండగా నువ్వు వెళ్లడం ఏంటి సుందరి అంటూ కోపంగా అన్నారు  రాఘవయ్య  పురోహితుడు ముహూర్తం  టైము దాటిపోతుందని వధువును త్వరగా తీసుకురండని  ఒకటే హడావుడి పెడుతున్నాడు నీవేమో దగ్గర ఉండవు  ఏంటి  నీ చాదస్తం మిగితావి  వేరే వాళ్లు చూసుకుంటారుగా అన్నారు రాఘవయ్యగారు

వస్తున్నానండి నేనేమైనా ఆడుకుంటూన్నాన మీ అమ్మాయే.పిలిచిందండి.మీ ఆడవాళ్లకి ఏదో ఒక   గోళ్లాలు ఎంతకీ  తెమిలించుకోరు అన్నారు. రాఘవయ్యగారు. సుమతి ముద్దబంతి.పూవ్వులా అందంగా తరయారు అయింది మేనమామలు పల్లకిలో.కుచోబెట్టారు.

పల్లకీలో తోడుగా అక్కబిడ్డ స్వీటీ  కూర్చుంది పల్లకీవెంట  కావల్సిన బందువులు మేనమామలు చిన్నమ్మలు  పెద్దమ్మలు అందరు మేళతాళాలు భాజా భజంత్రీలతో  వెంట రాగ  సుమతి  సిగ్గుతో తల వంచుకుని కూర్చుంది. తను ఆలోచనలో పడింది  ప్రభు సుమతి  ఇద్దరూ ప్రేమించుకున్నారు పెద్దల అనుమతితో  పెళ్లి కుదిరింది  ప్రభు సుమతి  ఇద్దరూ క్లాస్ మేట్స్ ఒకర్నొకరు ఇష్టపడ్డారు ఇద్దరు  ఒకే ఆఫీసులో సాఫ్ట్వేర్ గా  ఉద్యోగం చేస్తున్నారు.నాన్నను ఒప్పించడమూ  చాలా కష్టమైంది అయినా  ప్రభు మంచితనం చూసి ఒప్పుకున్నారు  హమ్మయ్య  ఏదో విధంగా నాన్న ను ఒప్పుకునేలా చేశాను.అనుకుంది    మనసులో

ప్రభు నీతో ఏడడుగులు వేస్తానని అనుకోలేదు చాలా థ్రిల్గా ఉంది.నువ్వు  కూడా ఇంత ఈజీగా ఒప్పుకుంటావ్ అని అనుకోలేదు ఐ యామ్ సో హ్యాపీ  నీతో వేసే ఏడు అడుగులు పూలబాటలుగా మారాలి  నీతో సంతోషంగా ఉండాలి  నా ఆనందం అంతా నీతోనే.నా జీవితం మల్లేతీగల అల్లుకుపోతూ ఎప్పుడు నీ తోనే సంతోషంగా. ఉండాలి అనుకున్నది సుమతి  అమ్మ  సుమతి దిగమ్మ అంటూ.మేనమామ చేయిపట్టుకుని. కిందకి దింపి పాలగుల్లలో కూర్చోబెట్టి స్టేజి పైకి తీసుకు వెళ్లి కూర్చోబెట్టారు

సుమతి  సిగ్గుల మొగ్గలా ప్రభువైపు  తలవంచుకొని ఓరచూపులతో కి ఘంటగా చూస్తూ కూర్చుంది.ప్రభు తనవైపు చూసి  నవ్వి  నవ్వనట్టుగా  చిరునవ్వుతో  చూశాడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకునే ఘట్టం  వచ్చింది మా పిల్ల ముందు మా పిల్లాడు  ముందు అంటూ  చిలిపి గొడవలతో పోటీ పడుతూ అల్లరి చేస్తూన్నారు

అసలు ముందుగా సుమతి ప్రభు నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టింది అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు సంతోషంతో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.ఆచూపుల్లో ఆనందం ఉంది   మంగళసూత్ర ధారణ ఘట్టం వచ్చింది  సుమతి సిగ్గుతో తలవంచుకొని  ఉండగా ప్రభు సుమతి  మెడలో మంగళసూత్రం కట్టే  చిలిపి ఘట్టం  ప్రభు  మంగళసూత్రం కడుతూ  సుమతి  మేడపై చిలిపిగా గిల్లాడు  సుమతి వొళ్లంతా  ఒక్కసారిగా పులకరించి పోయింది.

ఆ కళ్ళల్లో మెరుపు కనబడింది పురోహితుడు సుమతి కొంగుకు ప్రభు ఉత్తరాయానికి ముడి వేసి పక్క పక్కన కూర్చోబెట్టారు.భుజం భుజం రాసుకుంటూ పక్కనే కూర్చున్నారు సుమతి ప్రభు
మంగళసూత్రాలను కళ్లకు  అందుకుంది.సుమతి నాగవెళ్లి  సదస్సు కార్యక్రమాలన్నీ పూర్తి  అయ్యాయి భోజనాల ఘట్టం అందరూ భోజనాలు చేసి  బంధుమిత్రులు  అందరూ వచ్చి  వధూవరులను ఆశీర్వదించి వెళుతున్నారు. అప్పగింత కార్యక్రమం జరుగుతోంది రాఘవయ్యగారి దంపతులు సుమతిని ముందుగా  వియ్యంకులకు అప్పగిస్తున్నారు   ఆ తర్వాత రాఘవయ్యగారి దంపతులు ప్రభు చేతిలో పెట్టి ఏడుస్తూ మా సుమతిని అల్లారుముద్దుగా పెంచుకున్నాము ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాము   కష్టమైనా సుఖమైనా చూసే బాధ్యత ఇక నుంచి  నీదే బాబు అని  బాధనిండిన మనస్సుతో  అప్పగించారు.అక్కడ ఉన్న వారి  కళ్ళల్లో నుండి కన్నీళ్లు తెప్పించాయి. కనిపెంచి ఇంత పెద్ద వాళ్లను  చేసి ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు చాల  బాధగా ఉంటుంది.తల్లి మనసుకు

సుందరికి చాలా బాధగా ఉంది  సుమతిని అత్త వారింటికి పంపిస్తుంటే దుఃఖం ఆగడం లేదు దగ్గరకి తీసుకొని ఏడుస్తూ సుమతి  నీ అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకుని పుట్టింటి పేరు మేట్టినింట్టి మర్యాద కాపాడు.తల్లి  అంటూ సుమతిని కౌగిలించుకుని ఏడ్చింది సరే అమ్మ.నువ్వు కూడ బాధ పడకు అమ్మ అంది..ఒదారుస్తు.ప్రభు తల్లిదండ్రులు వచ్చి మీ అమ్మాయికి ఏం ఫర్వాలేదు మేము మాఅమ్మాయిలా చూసుకుంటాము అని ధైర్యం చెప్పారు ప్రభు కూడ మామగారికి  మాట ఇచ్చారు మీ అమ్మాయికి  ఏ బాధ.కల్గకుండా  బాగా చూసుకుంటానని  ధైర్యం చెప్పారు సంతోషంతో ఒకర్నొకరు వీడ్కోలు చెప్పుకుని పెండ్లి వారు వెళ్లి పోయారు హాలంతా నిశ్శబ్దంగా మారింది.

సుమతి  తొలి అడుగు  అత్తవారింట్లో అడుగుపెట్టింది
కొత్త  ఇల్లు కొత్త వాతావరణం అయినా ప్రభు తోడు
ఉన్నాడు గా  ఏమీ కొత్తగా  అనిపించలేదు.ఈ రోజే   రాత్రికి శోభనానికి ఏర్పాట్లు చేశారు.సుమతి తెల్లవారుజామునే  తలంటి స్నానం  చేసింది  అందమైన నల్లని  జుట్టు గాలికి ఎగురుతూ అందంగా కనబడుతుంది పెరటిలో ఆడపడుచు పక్కన కూర్చుని ఉంది ప్రభు అటువైపుగా వచ్చి సుమతిని చూశాడు  ఆ అందం చూసి మైమరచిపోయారు. కాటుక కళ్లు అందమైన  మొహం  చామనఛాయ అయినా  మొహంలో అందమైన కళ ఉంది.

సుమతి వైపు ఓరచూపు  చూస్తూ ఇటు రమ్మన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు హు…హు అంది  సిగ్గుతో. తలస్నానం చేసిన వెంట్రుకలు గాలికి ఎగురుతున్న వెంట్రుకలను తన ముని వేళ్లతో పైకి జరుపుకుంటు హైరానా పడుతుంది. ప్లీజ్ అంటూ బుంగమూతి పెట్టి అడిగాడు.చేసేది లేక అటు ఇటు చూస్తూ వెళ్లింది.

ఏంటి దొరగారి సంగతి  ఈ  దొంగచాటు వ్యవహారం
ఏంటి  అంటూ  చిలిపిగా నవ్వింది.ఇంత అందమైన భార్య నా పక్కన ఉండగా ఎలా అగమంటావు సుమతి చెప్పు అన్నాడు  తననే చూస్తూ  ముద్దుముద్దుగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు చాలు ఎవరైనా చూస్తారు.అంటూ తన కౌగిలి నుండి పక్కకు జరిగింది ఎవ్వరూ చూడరులే  అన్నాడు ప్రభు గట్టిగా పట్టుకుంటా అన్నయ్య మీరు ఇక్కడ ఉన్నారా  వ్రతానికి  టైమైంది పూజారిగారు వచ్చారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నయ్య అంటూ వచ్చింది తన చెల్లెలు  ప్రియ ఉలికిపాటుగా ఇద్దరు దూరంగా జరిగారు.

ఇద్దరూ వెళ్ళి  వ్రతం దగ్గర కూర్చున్నారు  సుమతి అందంగా అలంకరించుకుంది బంధువులు అందరూ సుమతి వైపే చూస్తున్నారు దిష్టి తాకేలా అందంగా   కుందనపు బొమ్మలా వుంది.పురోహితుడు తొందరగానే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశాడు
బంతి భోజనాల కార్యక్రమం ముందుగా  ప్రభును సుమతిని ఎదురెదురుగా కూర్చోబెట్టారు ఒకరి నోట్లో ఒకరు  పేరు  చెప్తూ  స్వీట్   పెట్టాలని గోలగోల చేస్తూ ఆటపట్టిస్తున్నారు  ఆడపడుచులు అల్లరితో కేరింతలు కొడుతున్నారు.ఇది జీవితంలో మర్చిపోలేని సందర్భం ఈ సాంప్రదాయ పద్ధతి చాలాబావుంటుంది అందుకే అంటారు పెద్దలు ప్రేమించి పెళ్ళి చేసుకో వద్దని అంటారు ఆ పెండ్లిళ్లు నిలకడగా ఉండవని

సాంప్రదాయమైన పద్ధతిలోనే చేసుకుంటే చాలా బావుంటుంది మనముందు ఫ్యూచర్ వారికి కూడా తెలుస్తాయి. ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటూ  తిన్నారు.రాత్రికి  శోభనం పాల గ్లాసుతో  సుమతి లోనికి వెళ్ళింది.సుమతి  కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు.అందంగా ముస్తాబై వెళ్లింది సుమతి
ఆఫ్ వైట్ సారీకి మెరూన్ కలర్ బార్డర్తో చక్కగా
అలంకరించుకుని వచ్చింది.

ఎదురుగా ఆమె సిగ్గుతో నేలచూపులు చూస్తూ నిలబడి వుంది ప్రభు ఆమె దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకొని కూర్చో బెట్టాడు ఏంటి సుమతి సిగ్గుపడుతున్నావు నా దగ్గర కూడా సిగ్గా అంటూ తన రెండు చేతులతో గడ్డం పైకెత్తి తన కళ్లలోకి చూసాడు సిగ్గుతో ప్రభు గుండెలపై తల దాచుకుంది. తను దగ్గరిగా అదుముకున్నాడు నవ్వుతూ  గిలిగింతలు పెడుతూ ఆనందం తో పరవశించి పోతున్నారు.

ప్రభు ఏంటి నీ అల్లరి మత్తుమత్తుగా అంది ఏంటి దీనికే  నవ్వుతూ అన్నాడు ఛీ పో ప్రభు అంది తన వైపుకు తిప్పుకుని తన పెదవులతో  సుమతి  పెదవులపై ఉన్న ప్రేమ అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు  ప్రభు లైట్ అంది  సారి మర్చిపోయానంటూ ఒకచేత్తో పవర్ కట్   చేస్తూ ఒక చేత్తో కురులను సవరిస్తూ తమ ప్రేమ సామ్రాజ్యంలో  ఓలలాడుతున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!