అపనమ్మకాలు అశాస్త్రీయాలు

(అంశం:”అపశకునం”)

అపనమ్మకాలు అశాస్త్రీయాలు

 

రచన:: పసుమర్తి నాగేశ్వరరావు

బయటకు వెళ్తుండగా ఒక పెద్దాయన ఎక్కడికి అని అడిగాడు విసుక్కోని లోపలకి వచ్చి యధావిధిగా మంచినీళ్లు తాగుతున్నాడు. ఈ లోగా సమయం పది కావొస్తుంది. ఇదంతా గమనించిన వాళ్ళ నాయనమ్మ ఒరేయ్ ఋషి ఇదంతా ఏమిటీ రా అని అడగ్గా అవన్నీ అపశకునాలే అని చెప్పాడు. అయితే గియతే నేను ముసలదాన్ని నేను పాటించాలి ఇవన్నీ.చదువుకున్నవాడికి నీకెందుకురా అని కోప్పడింది. పని బట్టే పట్టించుకోవాలి సమయం బట్టి అనుసరించాలి కానీ అవన్నీ మూఢనమ్మకాలు అని నాయనమ్మ కొట్టి పారేసింది
సరేలే వేగం గా వెల్లు టైం అవుతుంది అని చెప్పింది. సరిగ్గా 10 అయింది బయలు దేరాడు 11కి ఇంటర్వ్యూకి చేరుకున్నాడు
టెన్షన్ తో లోపలకి వెళ్ళాడు.ఇంటర్వ్యూ ప్రారంభం కాగానే ఋషికి తుమ్ము వచ్చింది.ఆపుకోలేక పోయాడు.కానిచ్చేశాడు.కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యాడు.ఇంటర్వ్యూ బాగా జరిగింది.ఇంటికి వచ్చాడు.నాయనమ్మకు విషయం చెప్పాడు. నువ్వు సక్సెస్ అవుతావు మనసులో పెట్టుకోకు అని చెప్పింది.అనుకున్నట్టే ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఉద్యోగం వచ్చింది.కానీ అమావాస్య రోజు జాయిన్ అవ్వాలి. దీని కోసం ఆఫీస్ వాళ్లకు రిక్వెస్ట్ చేసి తేదీ మార్చమని చెప్పాడు.కుదరలేదు.అమావాస్య రోజే జాయిన్ అయ్యాడు. మనసులో మాత్రం చిన్న వెలితి.నాయనమ్మ మాత్రం ప్రతీసారీ అపశకునాలును కొట్టి పారేసి ధైర్యం ఇచ్చేది. ఒక్క సంవత్సరం లో అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది.అదికూడా అమావస్యనాడే. జాయిన్ అయ్యాడు.తప్పలేదు.ఇలా ఎన్నో అపసకునాలతో ముందుకెళ్లిన ఋషి విజయ పథం లో ముందడుగు వేయసాగాడు. ఆ రోజు నుండి అపశకునాలు కేవలం మూఢనమ్మకాలు గా కొట్టి పడేశాడు. నలుగురికి కూడా మంచి చేయాలనుకున్నప్పుడు చేయడమే అని జరగవలసింది జరగక మానదు అని తెలుసుకున్నాడు.ఇతరులకు కూడా సలహా ఇవ్వడం మొదలు పెట్టాడు.అపనమ్మకాలు ఆశాస్త్రీయం అని జ్ఞానోదయం అయింది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!